Share News

MS Dhoni IPL 2025: రూల్స్ పెట్టడం అవసరమా.. ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:09 PM

CSK vs RCB: భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. అందులో అతడు తన జీవితంతో పాటు కెరీర్‌కు సంబంధించిన చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రూల్స్ అవసరమా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మాహీ ఇంకా ఏమన్నాడంటే..

MS Dhoni IPL 2025: రూల్స్ పెట్టడం అవసరమా.. ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
MS Dhoni

రూల్స్ అవసరమా.. చిన్న జీవితంలో కండీషన్స్ పెట్టుకొని బతికితే ఏం వస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. ఎప్పుడూ ఇంటర్వ్యూలు లాంటివి ఇవ్వని అతడు.. ఏదైనా బిగ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్న సమయాల్లో తప్పితే బయట పెద్దగా కనిపించడం, మాట్లాడడు కూడా. అలాంటోడు తొలిసారి యూట్యూబ్‌‌లోని ఓ పాపులర్ పాడ్‌కాస్ట్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జీవితంతో పాటు కెరీర్ గురించి అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడూ రూల్స్ పెట్టుకోవద్దని ధోని సూచించాడు. ఇలాగే కావాలి, అలాగే జరగాలంటూ నిబంధనలు పెట్టుకొని ఏ పనీ చేయొద్దని సజెస్ట్ చేశాడు.


ఒకే షెడ్యూల్..

ఏదైనా అనుకుంటే వెంటనే చేసేయాలని.. రూల్స్ పేరిట అనవసరంగా సంకెళ్లు వేసుకుంటే వచ్చేదేమీ లేదన్నాడు మాహీ. చాలా ఏళ్లుగా తాను ఒకే రొటీన్, షెడ్యూల్ ఫాలో అవుతూ వస్తున్నానని స్పష్టం చేశాడు. అభద్రతా భావం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదన్నాడు ధోని. జీవితంలో సవాళ్లు వస్తూనే ఉంటాయని, వాటిని ఎలా ఎదుర్కొన్నామనేదే ముఖ్యమని తెలిపాడు. చిన్నతనంలో నాన్న అంటే చాలా భయపడేవాడ్ని అని లెజెండరీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్‌లో ఆడుతున్న ధోని.. తదుపరి ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో అదరగొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ మీద నెగ్గి జోష్‌లో ఉన్న సీఎస్‌కే.. చిరకాల ప్రత్యర్థి బెంగళూరునూ ఓడించాలని పట్టుదలతో ఉంది. చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు జట్ల అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


ఇవీ చదవండి:

ఉప్పల్ పిచ్‌పై మిషన్ 300 సాధ్యమేనా..

క్రికెట్ లవర్స్‌కు RTC, మెట్రో స్పెషల్ ఆఫర్స్

ఇవాళ్టి మ్యాచ్‌లో వీళ్ల ఆట మిస్ అవ్వొద్దు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 27 , 2025 | 04:55 PM