SRH Batting Failure: ఆ ముగ్గురూ ఆడకపోతే తుస్సేనా.. ఇంత డిపెండెన్సీ అవసరమా..
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:58 PM
Indian Premier League: ఒక్క ఓటమితో సన్‌రైజర్స్ టీమ్‌లో చాలా సమస్యలు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లు కొన్ని ప్రాబ్లమ్స్ తదుపరి మ్యాచుల్లోనూ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

లక్నో సూపర్ జియాంట్స్‌ను చిత్తు చేస్తుందని అనుకుంటే.. 5 వికెట్ల తేడాతో ఓడి ఉసూరుమనిపించింది సన్‌రైజర్స్. ద్వితీయ విఘ్నాన్ని దాటడంలో కమిన్స్ సేన విఫలమైంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి ఐపీఎల్ నయా సీజన్‌ను పాజిటివ్‌గా స్టార్ట్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. వీక్ బౌలింగ్ అటాక్ ఉన్న ఎల్‌ఎస్‌జీ చేతుల్లో సొంతగడ్డపై అనూహ్య ఓటమిని చవిచూసింది. దీంతో ఒక్కసారిగా టీమ్‌లోని కొన్ని ఇష్యూస్ బయటపడ్డాయి. ముఖ్యంగా బ్యాటింగ్ అటాక్‌లోని సమస్యలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఆ ముగ్గురు ఆడకపోతే టీమ్ తుస్సేనా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తోపులు లేకపోయినా..
లక్నో టీమ్‌లో స్టార్ బౌలర్లు లేరు. శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్ తోపు వికెట్ టేకర్లేమీ కాదు. బిష్ణోయ్ పెద్ద ఫామ్‌లో లేడు. ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ పేర్లు కూడా చాలా మందికి తెలియవు. అలాంటి అటాక్‌ను ఎదుర్కోలేక సన్‌రైజర్స్ బ్యాటర్లు పెవిలియన్ దారి పట్టారు. 156 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఎస్‌ఆర్‌హెచ్. దీంతో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ ఆడకపోతే టీమ్ పరిస్థితి ఇంతేనా అనే డౌట్స్ వస్తున్నాయి. హెడ్ (47), అనికేత్ వర్మ (36) తప్ప నిన్న ఎవరూ రాణించలేదు. నితీష్ రెడ్డి (32) మంచి స్టార్ట్ వచ్చాక వికెట్ పారేసుకున్నాడు.
యాంకర్ రోల్ కీలకం
సాధారణంగా సన్‌రైజర్స్ భారీ స్కోర్లు బాదాలంటే టాపార్డర్‌లో హెడ్‌తో పాటు మరో ఓపెనర్ అభిషేక్ రాణించాలి. టీమ్‌లోకి కొత్తగా వచ్చిన కాటేరమ్మ చిన్న కొడుకు ఇషాన్ కిషన్ సక్సెస్ అవడం కూడా కీలకంగా మారింది. కానీ నిన్న వీళ్లిద్దరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అభిషేక్ 6 పరుగులు చేయగా.. ఇషాన్ డకౌట్ అయ్యాడు. వీళ్లిద్దర్నీ లార్డ్ శార్దూల్ ఔట్ చేశాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆదిలోనే బ్రేక్ పడింది. క్లాసెన్ (26) కీలక దశలో ఔట్ అవడంతో భారీ స్కోరు ఆశలు గల్లంతు అయ్యాయి. దీంతో ఒకవేళ ఈ ముగ్గురూ రాణించకపోతే టీమ్ తుస్సేనా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నితీష్ నిలబడాలి కదా అని నిలదీస్తున్నారు. అనికేత్, అభినవ్ లాంటి యంగ్‌స్టర్స్‌పై ఎంత వరకు నమ్మకం పెట్టుకుంటాం.. ఫినిషర్లుగా ఎవరో ఒక స్టార్ బాధ్యతలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. త్వరత్వరగా వికెట్లు పడిపోతే ఎవరో ఒకరు యాంకర్ రోల్ పోషించాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి:
కావ్యా పాపను బాధపెట్టారు కదరా..
వాళ్ల వల్లే మ్యాచ్ పోయింది:కమిన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి