Kavya Maran: కావ్యా పాపను బాధపెట్టారు.. మిమ్మల్ని వదిలేది లేదు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:14 PM
SRH vs LSG IPL 2025: సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్‌ను బాధగా చూసి తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఆమె బాధకు కారణమైన వారిపై సీరియస్ అవుతున్నారు. వదిలేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే అభిమానులు పండుగ చేసుకుంటారు. అదే ఒకవేళ మన జట్టు ఓడిందా నిరాశలో కూరుకుపోతారు. అయితే ఫ్యాన్సే కాదు.. టీమ్ ఓనర్ కావ్యా మారన్ కూడా ఆరెంజ్ ఆర్మీ గెలుపోటముల విషయంలో ఇలాగే వ్యవహరిస్తూ ఉంటుంది. యజమాని అనే కంటే ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆమె బడా ఫ్యాన్ గర్ల్ అనడం కరెక్ట్. ఎందుకంటే కమిన్స్ సేన బాగా ఆడుతుంటే స్టాండ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తెగ సందడి చేస్తూ ఉంటుంది కావ్యా పాప. అదే టీమ్ బాగా ఆడకపోయినా, ఓటమి పాలైనా ఆమె డల్ అయిపోతుంది. బాధతో ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిన్న దాదాపుగా ఇదే సీన్ రిపీట్ అయింది.
బాధ తట్టుకోలేక..
ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం లక్నో సూపర్ జియాంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది సన్‌రైజర్స్. దీంతో అభిమానులే కాదు.. స్టేడియంలో మ్యాచ్ తిలకిస్తున్న కావ్యా మారన్ కూడా డిజప్పాయింట్ అయింది. ఓటమికి చేరువవుతున్న కొద్దీ ఆమె తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేకపోయింది. బాధతో ముఖం దిగాలుగా పెట్టి కూర్చుంది. ఇలా ఆడుతున్నారేంటి అంటూ తల మీద చేతులు పెట్టి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.
వదలబోం
లక్నోతో మ్యాచ్ సమయంలో కావ్యా మారన్ బాధపడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. కావ్యా పాపను బాధపెట్టిన లక్నోను వదలొద్దని అంటున్నారు. ఆ జట్టును వాళ్ల సొంత గడ్డ మీద చిత్తుగా ఓడించి.. కావ్యను నవ్వేలా చేయాలని కోరుతున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఉప్పల్‌కు వచ్చి ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడిస్తారా.. మిమ్మల్ని వదిలేదే లేదని వార్నింగ్ ఇస్తున్నారు. రాసి పెట్టుకోండి.. కమిన్స్ సేన చేతుల్లో నెక్స్ట్ టైమ్ చిత్తుగా ఓడటం ఖాయమంటూ ఎల్‌ఎస్‌జీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
వాళ్ల వల్లే మ్యాచ్ పోయింది:కమిన్స్
జియోస్టార్ నుంచి నయా అప్డేట్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి