SRH vs LSG Pitch Report: ఉప్పల్ పిచ్ ఎవరికి అనుకూలం.. మిషన్ 300 సాధ్యమేనా..
ABN , Publish Date - Mar 27 , 2025 | 02:57 PM
Uppal Stadium Pitch Report: లక్నో సూపర్ జియాంట్స్‌ను మడతబెట్టేందుకు సిద్ధమవుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అచ్చొచ్చిన హోమ్ కండీషన్స్‌లో లక్నోపై తమ మిషన్‌ను కూడా కంప్లీట్ చేయాలని చూస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025లో ఇంకొన్ని గంటల్లో మరో ఇంట్రెస్టింగ్ క్లాష్ జరగనుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటి, లాస్ట్ సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు లక్నో సూపర్ జియాంట్స్‌కు నడుమ ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో పాటు 300 పరుగుల మార్క్‌ను అందుకోవాలనే కసితో కనిపిస్తోంది కమిన్స్ సేన. అటు పంత్ టీమ్ గెలిచి బోణీ కొడితే అదే పదివేలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది.. టాస్ గెలిస్తే బౌలింగ్-బ్యాటింగ్‌లో ఏది ఎంచుకుంటే బెటర్.. తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం..
పిచ్ రిపోర్ట్
ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటూ వస్తోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనూ ఇదే ప్రూవ్ అయింది. అటు రాజస్థాన్, ఇటు సన్‌రైజర్స్.. రెండు జట్లూ కలిపి 500కు పైనే పరుగులు చేశాయి. కాబట్టి ఇవాళ్టి మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదవడం ఖాయం. ఇక్కడ 200 ప్లస్ స్కోరు అనేది కామన్. టాస్ గెలిచిన టీమ్ తొలుత బ్యాటింగ్‌కు దిగడం పక్కాగా కనిపిస్తోంది. ప్రస్తుత కండీషన్స్, బ్యాటింగ్ డామినెన్స్, కరెంట్ ఫామ్ చూస్తుంటే.. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్ గనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 పరుగులు కొట్టేయడం పక్కా అనే చెప్పాలి.
వాళ్లదే హవా
ఉప్పల్ పిచ్ బ్యాటర్లకు సహకరించినా.. ఆరంభంలో పేసర్లకు కొంత హెల్ప్ లభించొచ్చు. కానీ స్పిన్నర్లకు మాత్రం ఇక్కడ కష్టమేనని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. డెత్ ఓవర్లలో బ్యాటర్లదే హవా నడవడం ఖాయమని చెబుతున్నారు. బౌండరీలు చిన్నగా ఉండటం వల్ల సిక్సుల మీద సిక్సులు నమోదవడం పక్కాగా కనిపిస్తోంది. ఇక, సూర్యుడు దంచేస్తున్నాడు కాబట్టి ఇవాళ్టి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే చాన్స్ లేదు. పూర్తి ఓవర్ల ఆట జరుగుతుంది. మొత్తంగా ఇది హైస్కోరింగ్ థ్రిల్లర్‌గా ముగిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టాస్ గెలిచిన టీమ్‌కు విన్నింగ్ చాన్సెస్ ఎక్కువ. కానీ దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆరెంజ్ ఆర్మీ టాస్ ఓడినా గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి.
ఇవీ చదవండి:
ఇవాళ్టి మ్యాచ్‌లో వీళ్ల ఆట మిస్ అవ్వొద్దు
ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ లక్నో.. ప్లేయింగ్ 11 ఇదే..
పాయింట్స్ టేబుల్‌లో ఊహించని ట్విస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి