Share News

Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. పదేళ్లలో ఇదే ఫస్ట్ టైమ్

ABN , Publish Date - Nov 06 , 2024 | 04:48 PM

Virat Kohli: న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఓటమి, బ్యాటింగ్ వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో అతడు తదుపరి ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో కింగ్‌కు మరో షాకింగ్ న్యూ్స్.

Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. పదేళ్లలో ఇదే ఫస్ట్ టైమ్

న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఓటమి, బ్యాటింగ్ వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఏం చేయాలో అతడికి పాలుపోవడం లేదు. ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని చూస్తున్నాడు. తదుపరి ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్యాట్‌తో విమర్శకులకు సమాధానం ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ తరుణంలో కింగ్‌కు మరో షాకింగ్ న్యూస్. కోహ్లీకి ఘోర అవమానం జరిగింది. ఇది తెలిస్తే విరాట్ అభిమానులే కాదు.. సాధారణ క్రికెట్ లవర్స్ కూడా ఆశ్చర్యపోక తప్పదు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


పదేళ్లలో ఇదే తొలిసారి

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా మెన్స్ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో కోహ్లీ 22వ స్థానానికి పడిపోయాడు. అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతమైన ఆటతీరుతో మోడర్న్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న కింగ్.. ర్యాంకింగ్స్‌లో ఇంతలా దిగజారడం చర్చనీయాంశంగా మారింది. 2014, ఆగస్టులో 24వ ర్యాంకులో ఉన్న కింగ్.. గత పదేళ్లుగా లాంగ్ ఫార్మాట్‌లో తన హవా నడిపిస్తున్నాడు. ర్యాంకింగ్స్‌లో టాప్-3 నుంచి టాప్-10లో ఉంటూ తన స్టార్‌డమ్ తగ్గకుండా చూసుకున్నాడు. అలాంటోడు హఠాత్తుగా టాప్-20 కంటే కిందకు పడిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.


పరువు కాపాడిన జూనియర్లు

న్యూజిలాండ్ సిరీస్‌లో వైఫల్యంతో పాటు అంతకంటే ముందు జరిగిన బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ అంతగా రాణించకపోవడం కోహ్లీకి మైనస్‌గా మారింది. టెస్టులు తక్కువగా ఆడటం, ఆడిన వాటిల్లో ఫెయిల్ అవడంతో పదేళ్ల కాలంలో తొలిసారి ఇరవై కంటే తక్కువ ర్యాంకుకు దిగజారాడు కింగ్. ఇది అభిమానులకు మింగుడుపడని విషయమనే చెప్పాలి. ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్న రారాజు.. ర్యాంకులను ఏలిన విరాట్ ఇలా కిందకు రావడం ఘోర అవమానమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (26వ ర్యాంకు) కూడా ర్యాంకింగ్స్‌లో దిగజారడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి జూనియర్లు యశస్వి జైస్వాల్ (4వ ర్యాంకు), రిషబ్ పంత్ (6వ ర్యాంకు) టాప్-10లో నిలిచి పరువు కాపాడారు.


Also Read:

రీటైన్ చేయకపోయినా ఆర్సీబీతోనే మ్యాక్స్‌వెల్.. ఇదెక్కడి ట్విస్ట్

రోహిత్-కోహ్లీకి కైఫ్ వార్నింగ్.. కట్ చేయాలంటూ..

వామప్‌ మ్యాచ్‌ రద్దు సరికాదు

For More Sports And Telugu News

Updated Date - Nov 06 , 2024 | 04:58 PM