Share News

India vs SriLanka: కష్టాల్లో టీమిండియా.. 96 కే 6 వికెట్లు డౌన్!

ABN , Publish Date - Aug 07 , 2024 | 07:35 PM

సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా తడబడుతోంది. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో పరాజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి టై అవగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది.

India vs SriLanka: కష్టాల్లో టీమిండియా.. 96 కే 6 వికెట్లు డౌన్!
India vs SriLanka

సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా తడబడుతోంది. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో పరాజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి టై అవగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (96) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ నిశాంక 45 పరుగులతో ఆకట్టుకున్నాడు.


అనంతరం 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా శ్రీలంక బౌలర్ల ధాటికి విలవిలలాడుతోంది. ఓపెనర్ గిల్ (6) త్వరగానే అవుట్ అయినప్పటికీ రోహిత్ శర్మ దూకుడుగా ఆడి 35 పరుగులు చేశాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలబడలేకపోయారు. కోహ్లీ (20), రిషబ్ పంత్ (6), శ్రేయస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ (2) వెంట వెంటనే అవుటయ్యారు. దీంతో టీమిండియా ప్రస్తుతం 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే చేసింది.


రియాన్ పరాగ్ (10 నాటౌట్), శివబ్ దూబే (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే 4 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. మహేష్ తీక్షణ, అసిత్ ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు. టీమిండియా గెలవాలంటే 36 ఓవర్లలో 156 పరుగులు చేయాలి.

ఇవి కూడా చదవండి..

Paris Olympics: ఆసుపత్రిలో చేరిన వినేష్ ఫోగట్..


ఒకే ఒక్క త్రో...

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 07 , 2024 | 07:37 PM