Share News

India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన.. కోహ్లీ అంటే ఎంత ప్రేమో చూపించిన పాక్ మహిళా అభిమాని..

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:52 PM

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, ``కింగ్`` కోహ్లీని భారతీయులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఇష్టపడతారు. మన దాయాది దేశమైన పాకిస్తాన్‌లో కూడా కోహ్లీకి వీరాభిమానులున్నారు.

India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన.. కోహ్లీ అంటే ఎంత ప్రేమో చూపించిన పాక్ మహిళా అభిమాని..
Pakistani girl wearing Virat Kohli's pendant

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, ``కింగ్`` కోహ్లీని (Virat Kohli) భారతీయులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఇష్టపడతారు. మన దాయాది దేశమైన పాకిస్తాన్‌ (Pakistan)లో కూడా కోహ్లీకి వీరాభిమానులున్నారు. తాజాగా ఓ మహిళా అభిమాని కోహ్లీపై తనకున్న ప్రేమను కెమేరాల సాక్షిగా బయటపెట్టింది. టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup)లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఇటీవల భారత్-పాక్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.


ఆ మ్యాచ్ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళా అభిమాని (Pakistani girl) హల్‌చల్ చేసింది. ఆమె కోహ్లీ ఫొటో ఉన్న లాకెట్‌ను (Virat Kohli's pendant) ధరించి ఉంది. అంతేకాదు ఆ లాకెట్‌పై కోహ్లీ జెర్సీ నెంబర్ 18 కూడా ఉంది. ఆమె ఆ లాకెట్‌ను చూపిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ ఆ పాక్ యువతిని అభినందిస్తున్నారు. ``కోహ్లీ గ్లోబల్ ఐకాన్``, ``కోహ్లీపై అభిమానానికి ఎల్లలు ఉండవు``, ``కోహ్లీ ఆల్‌టైమ్ గ్రేట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


కాగా, ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌కు అది వరుసగా రెండో విజయం కాగా, పాకిస్తాన్‌కు అది వరుసగా రెండో ఓటమి. ఆ ఓటమితో పాకిస్తాన్ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే సూపర్‌-8కి చేరుతాయి. వరుసగా రెండు ఓటములతో పాయింట్ల ఖాతా తెరవలేకపోయిన బాబర్‌ సేనకు తదుపరి దశ చాన్స్ కష్టమే. కెనడా, ఐర్లాండ్‌తో జరిగే ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో పాక్‌ భారీ తేడాతో నెగ్గితే అవకాశం ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి..

BAN vs SA: ఆ నిర్ణయమే బంగ్లాదేశ్ కొంపముంచింది.. ఎంత పని చేశావయ్యా!


T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. ఆ రికార్డ్ గల్లంతు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2024 | 04:03 PM