India vs England: డబ్య్లూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియాకు ప్రమోషన్.. ఎన్నో స్థానానికి చేరిందంటే..
ABN , Publish Date - Feb 05 , 2024 | 04:25 PM
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా ర్యాంక్ మెరుగుపడింది. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది.
వైజాగ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ (Vizag Test Match)లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన టీమిండియా ర్యాంకింగ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో (WTC Points Table) మెరుగుపడింది. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్ ఓటమితో టీమిండియా రెండో స్థానం నుంచి ఐదో ప్లేస్‌కు పడిపోయింది.
వైజాగ్‌లో భారీ విజయం సాధించడంతో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ కోసం పోటీ పడతాయనే సంగతి తెలిసిందే. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీతో సత్తా చాటారు. ఇక, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రాకు ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డు దక్కింది.