CM Revanth Reddy: 23న కోకాపేటకు సీఎం రేవంత్‌రెడ్డి రాక
ABN , Publish Date - Aug 21 , 2024 | 10:44 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఈనెల 23న కోకాపేటకు రానున్నారు. కోకాపేట హరేరామ హరేకృష్ణ(Harerama Harekrishna) స్థలం ప్రాంగణంలో 430 అడుగుల ఎత్తుతో శ్రీకృష్ణ ఆలయం(హరేకృష్ణ హెరిటేజ్ టవర్) నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
నార్సింగ్(హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఈనెల 23న కోకాపేటకు రానున్నారు. కోకాపేట హరేరామ హరేకృష్ణ(Harerama Harekrishna) స్థలం ప్రాంగణంలో 430 అడుగుల ఎత్తుతో శ్రీకృష్ణ ఆలయం(హరేకృష్ణ హెరిటేజ్ టవర్) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేషస్థాపన పూజా కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు తదితర కార్యక్రమాలు ఉంటాయని హరేరామ హరేకృష్ణ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం నిర్మించబోయే నిర్మాణాలను ట్రస్ట్ విడుదల చేసింది.
.....................................................................
ఈ వార్తను కూడా చదవండి:
......................................................................
Trains: పలురైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) డివిజన్‌లలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సెప్టెంబర్ 1నుంచి 30వ తేదీ వరకు సికింద్రాబాద్-వరంగల్ ఎంఈఎంయూ(07462) రైలు, వరంగల్-హైదరాబాద్ ఎంఈఎంయూ రైలు (07463), కాజీపేట-బల్లార్షా (17035), సెప్టెంబర్ 2నుంచి అక్టోబర్ 1వరకు బల్లార్షా-కాజీపేట (17036), సెప్టెంబర్ 1నుంచి 30వరకు సిర్పూర్‌టౌన్-కరీంనగర్ ఎంఈఎంయూ (07766), కరీంనగర్-బోధన్ ఎంఈఎంయూ(Karimnagar-Bodhan MEMU)(07894),
నవంబర్ 2నుంచి అక్టోబర్ 1వరకు బోధన్-కరీంనగర్ ఎంఈఎంయూ (07893), కరీంనగర్-సిర్పూర్ టౌన్ (07765), నవంబర్1నుంచి 30వరకు కాచిగూడ-నడికుడి(07791), నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. సెప్టెంబర్1నుంచి 30వరకు హెచ్‌ఎస్. నాందేడ్-రాయిచూర్(17664) రైలును తాండూర్-రాయచూర్‌ల మధ్య, సెప్టెంబర్2 నుంచి అక్టోబర్ 1వరకు రాయిచూర్-పర్భని (17663) రైలును రాయిచూర్-తాండూర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News