Share News

Harish Rao: బతుకమ్మరోజు ఆడబిడ్డలకు ఒక్కచీరా ఇవ్వలేదు

ABN , Publish Date - Oct 17 , 2024 | 04:18 AM

‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బతుకమ్మరోజు రెండుచీరలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకు ఒక్క చీరకూడా ఇవ్వలేదు.

Harish Rao: బతుకమ్మరోజు ఆడబిడ్డలకు ఒక్కచీరా ఇవ్వలేదు

  • కాంగ్రెస్‌ మార్పు అంటే ఇదేనా?: హరీశ్‌ రావు

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బతుకమ్మరోజు రెండుచీరలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకు ఒక్క చీరకూడా ఇవ్వలేదు. దసరా పండుగకు రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లను ప్రభుత్వం నిరాశపరిచింది’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ తెస్తానన్న మార్పు ఇదేనా? ఉన్న పథకాలు బంద్‌ పెట్టడమేనా..? అని ప్రశ్నించారు.


తాము అధికారంలోకి వస్తే రైతుబంధు రూ.15వేలిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, కానీ వానాకాలం పంటకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ముదిరాజ్‌లు, గంగపుత్రుల ఉపాధి దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రీజినల్‌ రింగ్‌ రోడ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్చడంతో ప్రజలపై రూ.20వేల కోట్ల భారం పడనుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులు, ముఖ్యుల స్వార్థ ప్రయోజనాల కోసమే ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపించారు.

Updated Date - Oct 17 , 2024 | 04:18 AM