Share News

Hyderabad: 4న సింగూరు జలాలు బంద్‌..

ABN , Publish Date - Jul 02 , 2024 | 10:14 AM

హైదరాబాద్‌ మహానగరానికి గురువారం సింగూరు జలాల(Singur water) సరఫరా బంద్‌ కానున్నది. నగరంలోని పలు ప్రాంతాలకు దాదాపు 24గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది.

Hyderabad: 4న సింగూరు జలాలు బంద్‌..

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహానగరానికి గురువారం సింగూరు జలాల(Singur water) సరఫరా బంద్‌ కానున్నది. నగరంలోని పలు ప్రాంతాలకు దాదాపు 24గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. నగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్‌లకు విద్యుత్‌ను సరఫరా చేసే 132 కేవీ పెద్దాపూర్‌, కంది సబ్‌స్టేషన్ల(Peddapur and Kandi substations)లో టీజీ ట్రాన్స్‌కో అధికారులు గురువారం ఉదయం ఏడు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు మరమ్మతు చేయనున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: పాముతో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు..


దీంతో షేక్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, సోమాజిగూడ, బోరబండ(Shakepet, Jubilee Hills, Somajiguda, Borabanda), మూసాపేట్‌, నల్లగండ్ల, చందానగర్‌, హుడా కాలనీ, హఫీజ్‌పేట్‌, మణికొండ, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాలకు దాదాపు 24 గంటలపాటు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. భోజగుట్ట రిజర్వాయర్‌, బంజారా, ఎర్రగడ్డ, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, తెల్లాపూర్‌, ఓ అండ్‌ ఎం డివిజన్‌-8లోని బల్క్‌ కనెక్షన్లకు పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 10:14 AM