Share News

Hyderabad: రూ. 11వేలకే ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు..

ABN , Publish Date - Dec 11 , 2024 | 01:46 PM

రూ. 11 వేల పెట్టుబడితో టూ, త్రీ వీలర్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఇన్‌స్టాల్‌ చేసేందుకు విప్లవాత్మక నమూనాతో వస్తున్నామని వర్కాస్‌ రైటో ఎలక్ర్టిక్స్‌ కంపెనీ సీటీఓ సందీప్‌ రాల్హాన్‌(Sandeep Ralhan) అన్నారు. కిరాణా, పాన్‌, పంక్చర్‌ షాపుల్లో 25వేల ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Hyderabad: రూ. 11వేలకే ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు..

- 25 వేల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యం

- రేపటినుంచి హైటెక్స్‌లో ఇండియా గ్రీన్‌ ఎనర్జీ ఎక్స్‌పో

హైదరాబాద్‌: రూ. 11 వేల పెట్టుబడితో టూ, త్రీ వీలర్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఇన్‌స్టాల్‌ చేసేందుకు విప్లవాత్మక నమూనాతో వస్తున్నామని వర్కాస్‌ రైటో ఎలక్ర్టిక్స్‌ కంపెనీ సీటీఓ సందీప్‌ రాల్హాన్‌(Sandeep Ralhan) అన్నారు. కిరాణా, పాన్‌, పంక్చర్‌ షాపుల్లో 25వేల ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. త్రీఫేజ్‌ విద్యుత్‌ కనెక్షన్‌(Three-phase electricity connection)తో పాటు వాహనం చార్జ్‌ చేయడానికి తగినంత పార్కింగ్‌ స్థలం ఉంటే సరిపోతుందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బయట పరదా.. లోపల పనులు.. సీజ్‌ చేసినా ఆగని అక్రమ నిర్మాణాలు


ఖైరతాబాద్‌ రెడ్‌హిల్స్‌ ఎఫ్‌టీసీసీఐ(Khairatabad Red Hills FTCCI)లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా డే డైరెక్టర్లు రామ్‌ సౌందాల్కర్‌, మహ్మద్‌ ముదస్సర్‌, కాషీప్‌ రాజ్‌లు మాట్లాడుతూ ఈనెల 12, 13, 14 తేదీల్లో హైటెక్స్‌లో ఇండియా గ్రీన్‌ ఎనర్జీ పేరిట ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎక్స్‌పోను గురువారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు.


గ్రీన్‌ వెహికల్‌ ఎక్స్‌పో 6వ ఎడిషన్‌లో ఎలక్ర్టిక్‌, హైబ్రిడ్‌ వాహనాలు, బైక్‌లు, స్కూటర్లు, కార్లు, ఎల్‌సీవీలు, హెచ్‌సీవీలు, ట్రక్కులు, బ్యాటరీతో నడిచే వాహనాలు, విడి విభాగాలు, ఉపకరణాలు, భాగాలు, బ్యాటరీలకు చెందిన అనుబంధ పరిశ్రమలు ప్రదర్శనలో పాల్గొంటాయని తెలిపారు. ఎక్స్‌పోలో భాగంగా వర్కాస్‌- ఆర్‌ వైటో ఎలక్ర్టిక్స్‌ రూ.38,500 విలువగల ఈవీ స్కూటర్‌ను రూ. 24,500 విక్రయిస్తున్నట్లు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?

ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌!

ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2024 | 01:46 PM