ABN Big Debate: అసలైన సీఎంను అప్పుడు చూస్తారు.. రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ABN , Publish Date - May 07 , 2024 | 09:33 PM
ABN Big Debate with Revanth Reddy: ఆగస్టు 15వ తేదీలోగా రైతుల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అందరూ కేసీఆర్ లాగే ఉంటారని హరీష్ పొరపడుతున్నారని.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు రేవంత్. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిడ్ డిబేట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ABN Big Debate with Revanth Reddy: ఆగస్టు 15వ తేదీలోగా రైతుల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అందరూ కేసీఆర్ లాగే ఉంటారని హరీష్ పొరపడుతున్నారని.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు రేవంత్. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిడ్ డిబేట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో సీఎం.. పరిపాలనా విషయాలు సహా.. రాజకీయ పరమైన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు.
చర్చలో భాగంగా.. తెలంగాణలో నేతలు మాట్లాడుతున్న భాషపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆ పదవికి తగ్గ భాష మాట్లాడటం లేదని కేసీఆర్ చేసిన విమర్శలను ఆర్కే ప్రస్తావించగా.. తాను అలా మాట్లాడేందుకు ఆద్యుడు కేసీఆరే అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడితేనే తాను తిరగబడి మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు. దెబ్బతాకిన కోలుకున్న తరువాత బయటకొచ్చిన కేసీఆర్.. నోటికొచ్చినట్లు మాట్లాడారు. పచ్చి బూతులు తిట్టారు. అందుకే.. తాను కూడా అదే భాషలో కేసీఆర్‌కు సమాధానం చెప్పానని రేవంత్ వివరణ ఇచ్చారు. తానెప్పుడూ ముందు మాట్లాడనని.. ఎవరైనా అంటేనే రెండు మూడు రోజులు చూసి ఆ తరువాత వాళ్ల సంగతి ప్రజల సమక్షంలోనే తేలుస్తానని చెప్పారు.
పరుష పదజాలంపై రేవంత్ ఏమన్నారంటే..
‘తెలంగాణలో తగని భాషా ప్రయోగానికి కేసీఆరే పితామహులు. పదవి నుంచి దిగిపోయాకైనా.. వ్యవహారాన్ని మార్చుకుంటే మంచిది. నేను మాట్లాడుతాను కానీ.. మీరేమీ అనొద్దంటే నాదగ్గర కుదరదు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. పెద్దలు జానారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి వారు మర్యాదకు ఊరుకున్నారు. అతని మాకెందులే అని పెద్దరికంతో వదిలేశారు. నాకు అంత మర్యాద లేదు.. ఆయన పట్ల అంత గౌరవము, కనికరమూ లేదు. ఆ పెద్దలకు నాకు తేడా ఉంది.’
అసలైన సీఎంను అప్పుడు చూస్తారు..
‘జూన్ 4 తరువాత రాజకీయంగా స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఎన్నికల ప్రక్రియ అయిపోగానే.. ముఖ్యమంత్రిలాగే వ్యవహరించి.. రాష్ట్రాన్ని చక్కదిద్ది.. ప్రజల కోసం కమిట్‌మెంట్‌తో పని చేస్తాను. డిసెంబర్ 3 కంటే ముందున్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు వంద రోజుల రేవంత్ రెడ్డిని మీరు చూశారు. మార్చి 17 నుంచి పార్టీ ప్రెసిడెంట్‌గా నడుచుకుంటున్నాను. ప్రధాని మోదీ వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడుతారు. ఆయన స్థాయిలో ఆయన మాట్లాడే భాష లేదు కదా.. అమిత్ షా భాష ఆయన లెవల్లో లేదు కదా. ఈ స్టేట్ నుంచి నేనే కదా కౌంటర్ ఇవ్వాల్సింది. ఈ స్టేట్‌కు వచ్చి మాట్లాడుతుందే నా గురించి.. టార్గెట్ చేస్తుందే నన్ను. నేను వెనక్కి తిరిగి కౌంటర్ ఇవ్వకపోతే ఏమంటారు. రేవంత్ భయపడిపోయాడు. వెనక్కి తగ్గాడని అంటారు. టెంపర్‌మెంట్‌తో పాటు.. పార్టీ కేడర్‌లో ప్రోత్సాహం కల్పించాలి. కేసీఆర్ వల్లే.. ఇప్పుడు ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. జూన్ 4 తరువాత ఆ పరిస్థితి ఉండదు.’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.