Chinna Reddy: రైతు బంధుపై చెన్నారెడ్డి ఏమన్నారంటే..
ABN , Publish Date - Nov 27 , 2024 | 10:01 PM
టెక్నికల్ కారణాలతో ఆగి పోయిన రుణమాఫీని ప్రభుత్వం త్వరలోనే వేస్తుందని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చెన్నారెడ్డి తెలిపారు. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ కూడా ఖాతాల్లో పడుతుందని అన్నారు. ప్రతిపక్షాల మాటలను రైతులు నమ్మొద్దని చెన్నారెడ్డి చెప్పారు.
హైదరాబాద్: రైతు బంధును బీఆర్ఎస్ హయంలోనే ఆపేశారని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చెన్నారెడ్డి అన్నారు. రైతు పని ముట్లకు సబ్సిడీ ఎత్తేశారని మండిపడ్డారు. మహబూబ్ నగర్‌లో రేపటినుంచి మూడు రోజుల పాటు వ్యవసాయ పరికరాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో చెన్నారెడ్డి మాట్లాడుతూ.. చివరి రోజు ఈ నెల 30న రైతు విజయోత్సవ సభ జరుగుతుందని అన్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెన్నారెడ్డి తెలిపారు.
టెక్నికల్ కారణాలతో ఆగి పోయిన రుణమాఫీని ప్రభుత్వం త్వరలోనే వేస్తుందని తెలిపారు. అందు కోసం సీఎం నిధులు విడుదల చేస్తారని చెప్పారు. ఈ సభలో దీనిపై సీఎం ప్రకటన చేస్తారని అన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ కూడా ఖాతాల్లో పడుతుందని అన్నారు. ప్రతిపక్షాల మాటలను రైతులు నమ్మొద్దని చెప్పారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెన్నారెడ్డి అన్నారు.
కేటీఆర్ యూట్యూబ్ వాళ్లకి పైసలు ఇస్తున్నారు: మందుల సామేలు
మాజీ సీఎం కేసీఆర్ ఇజ్జత్ మొత్తం మాజీ మంత్రి కేటీఆర్ తీస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూడా ఎప్పుడూ ఇంత నీచంగా మాట్లాడలేదని చెప్పారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ.. సాధారణ ప్రజలు మాట్లాడే దానికంటే చెత్తగా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ యూట్యూబ్ వాళ్లకి పైసలు ఇస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ భాష చూసి సిగ్గేస్తుందని అన్నారు. సిరిసిల్ల చేనేతల పొట్ట కొట్టిన దుర్మార్గులు బీఆర్ఎస్ నేతలు అని ధ్వజమెత్తారు. అధికారం అంటే వైన్స్ షాపులో వెళ్లి కొనుకొచ్చుకునేది అనుకున్నావా అని విమర్శించారు. కేటీఆర్ మాటలకు బీఆర్ఎస్ నాయకులే తిడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి పిల్లికి కుక్కకి ఉన్న సంబంధం ఉంటుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ మాట్లాడేవి రెచ్చగొట్టే మాటలు కాదని అన్నారు. కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకుని ఎమ్మెల్సీ ఇచ్చింది బీఆర్ఎస్ నాయకులు కాదా అని ప్రశ్నిచారు. కిరికిరి పెట్టుకొని కేటీఆర్ ఇబ్బందుల్లో పడొద్దని మందుల సామేలు హెచ్చరించారు.