Share News

TG News: వనపర్తి జిల్లాలో ఓ సీఐ నిర్వాకం.. ఆస్తి కోసం తల్లిదండ్రులనే..!

ABN , Publish Date - Aug 06 , 2024 | 02:05 PM

వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను కుమారులు, కుమార్తెలు చిత్రహింసలకు గురి చేస్తున్న ఉదంతాలు ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆస్తి కోసం కొంతమంది చిత్రహింసలు పెడుతుంటే, వృద్ధాప్యంలో వారికి సేవలు చేయలేక మరికొంతమంది కర్కశంగా వ్యవహిస్తున్నారు. కనీ పెంచిన తల్లిదండ్రులపై దాడి చేసి వారిని నడిరోడ్డుపై వదిలేసిన ఘటనలు ఎన్నో చూస్తుంటాం.

TG News: వనపర్తి జిల్లాలో ఓ సీఐ నిర్వాకం.. ఆస్తి కోసం తల్లిదండ్రులనే..!

హైదరాబాద్: వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను కుమారులు, కుమార్తెలు చిత్రహింసలకు గురి చేస్తున్న ఉదంతాలు ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆస్తి కోసం కొంతమంది చిత్రహింసలు పెడుతుంటే, వృద్ధాప్యంలో వారికి సేవలు చేయలేక మరికొంతమంది కర్కశంగా వ్యవహిస్తున్నారు. కనీ పెంచిన తల్లిదండ్రులపై దాడి చేసి వారిని నడిరోడ్డుపై వదిలేసిన ఘటనలు ఎన్నో చూస్తుంటాం. అందుకు నిరక్ష్యరాసులు, విద్యావంతులు అన్న తేడా లేదు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.


వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ మల్టీ జోన్-2లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అయితే రఘునాథ్ రెడ్డి తన ఆస్తి 30ఎకరాల 23గుంటల్లో నాగేశ్వర్ రెడ్డికి 15ఎకరాలు, చిన్న కొడుకు యాదయ్యకు 11ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇచ్చారు.


అయితే 15ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకో 5ఎకరాలు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను తీవ్రంగా హింసిస్తున్నారు. వారిపై భౌతిక దాడులు చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. తల్లిదండ్రులను అన్న పెడుతున్న చిత్రహింసలను తట్టుకోలేక యాదయ్య మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి, అతనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌కి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Aug 06 , 2024 | 02:05 PM