Share News

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:06 PM

Telangana: 40 మంది చనిపోయినట్లు తెలుస్తోందని.. ఎన్‌కౌంటర్‌పై మీడియాకు వివరాలు వెల్లడించాలని గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులను వాస్తవాలు తెలుసుకునేందుకు పంపించాలన్నారు. పాలకులు కూడా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం
Civil Rights Commission president Gaddam Laxman angry over Chhattisgarh encounter Hyderabad Telangana

హైదరాబాద్, అక్టోబర్ 5: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై (Chhattisgarh Encounter) పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కీలక సభ్యులు ఉన్నారని తెలుస్తోందన్నారు. 40 మంది చనిపోయినట్లు తెలుస్తోందని.. ఎన్‌కౌంటర్‌పై మీడియాకు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను వాస్తవాలు తెలుసుకునేందుకు పంపించాలన్నారు. పాలకులు కూడా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా చెప్పినట్లు యుద్ధం తుది దశకు చేరుకుందా అని అనిపిస్తోందన్నారు. టీవీ డిబేట్లలో పాల్గొనే వారు సత్యాన్వేషణ చేయాలని కోరారు. ఎన్‌కౌంటర్ నిజా నిజాలు బయటకు రావాలన్నారు.
Tirumala Laddu: సుప్రీంకోర్టు చెప్పినా.. లడ్డూ వివాదంపై రాజకీయమే.. తీరు మార్చుకోని వైసీపీ


ఎన్‌కౌంటర్‌కు ముందు మావోయిస్టు కీలక సభ్యులు కలుసుకున్నారని సమాచారం తెలిసినప్పటికీ... మాట్లాడకుండా దాడి చేశారన్నారు. ఇప్పటికి మూడు సార్లు అమిత్ షా ఛత్తీస్‌గఢ్ సందర్శించారని.. కానీ అక్కడ ఆదివాసీల సమస్యల మీద ఎటువంటి హామీలు ఇవ్వలేదని విమర్శించారు. కేవలం మావోయిస్టులను ఏరివేతలపై, తుదముట్టడించడం పైనే మాట్లాడారని మండిపడ్డారు. తీవ్రమైన వ్యాధులతో ఆదివాసీలు అక్కడి ప్రాంతాల్లో మరణిస్తున్నారని.. కానీ వారికి ఎలాంటి సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కరెంటు కూడా అందించలేదని తెలిపారు.

Canada: కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!


ఈ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే వెంటనే చనిపోయిన వారి ఫోటోలు జాబితాలతో సహా ప్రకటించాలన్నారు. వారిని గౌరవంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించి అంత్యక్రియలు జరిపించాలని అన్నారు. హింస ప్రతి హింసకు దారి తీస్తుందని గుర్తించాలని సూచించారు. ఆదివాసీల కష్టాలను తెలుసుకునేందుకు, తీర్చేందుకు అక్కడ మావోయిస్టు పార్టీ పని చేస్తోందని వెల్లడించారు. కానీ మావోయిస్టులతో పాటు ఆదివాసీలను కూడా మట్టుపెడతామనడం సరికాదన్నారు. చర్చల ద్వారా ప్రతి విషయాన్ని పరిష్కరించుకోవాలని గడ్డం లక్ష్మణ్ హితవుపలికారు.


భారీ ఎన్‌కౌంటర్..

కాగా.. చత్తీస్‌గఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్‌, దంతెవాడ సరిహద్దు నెందూర్‌, తులతులి అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు ఇంటెలిజెన్స్‌ నుంచి సమాచారం అందింది. ఈ రెండు జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వు గార్డు (డీఆర్‌జీ), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌)తో పాటు ఐటీబీపీ, బీఎ్‌సఎఫ్‌ బెటాలియన్లకు చెందిన మొత్తం 1200 మంది మావోయిస్టుల కోసం సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఓర్చా, బారాసూర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని గ్రామాలు గోవెల్‌, నెందూర్‌, తులతులి సమీపంలో శుక్రవారం ఉదయం అబూజ్‌మడ్‌లో బలగాలు కూంబింగ్‌ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నెందూర్‌-తులతులి సమీపంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు మొదలు పెట్టడంతో ప్రతిగా బలగాలు తీవ్రంగా స్పందించాయి. ఇరువర్గాల మధ్య భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. సాయంత్రం అడవుల్లో గాలించగా 28 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను గుర్తించాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..

Devinavaratri: ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు.. ప్రత్యేకత ఇదే

Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. నైవేద్యం ఇదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 05 , 2024 | 04:08 PM