Hydra: నేనడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చురక
ABN , Publish Date - Sep 30 , 2024 | 11:31 AM
Telangana: ‘‘చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కూల్చేస్తారా.. నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి... జంప్ చేయకండి..అమీన్ పూర్‌పై మాత్రమే మాట్లాడండి... కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు ’’
హైదరాబాద్, సెప్టెంబర్ 30: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై (Hydra Commissioner Ranganath) హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై యజమానులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈరోజు(సోమవారం) బాధితుల పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు. వర్చువల్‌గా హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.
KTR: పంచాయతీల్లో పాలన గాడి తప్పింది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విసుర్లు
కూల్చివేతలకు రంగానాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి అని సూటిగా ప్రశ్నించింది. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అని నిలదీసింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని.. హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పండి అంటూ కమిషనర్‌ను గట్టిగా నిలదీసింది ధర్మాసనం.
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై విచారణ
‘‘మీరు చట్టాన్ని ఉల్లఘించి కూల్చివేతలు చేస్తున్నారు’’ అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కూల్చేస్తారా.. నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి... జంప్ చేయకండి. అమీన్ పూర్‌పై మాత్రమే మాట్లాడండి... కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు ’’ అంటూ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చురకంటించింది. హైడ్రా కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెడుతున్నట్లు హైకోర్టు భావిస్తుందన్నారు. అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలని.. లేదా సీజ్ చేయాలని... కానీ నిబంధనలు ఉల్లగించి ఆదివారం కూల్చడం ఏంటి అని ప్రశ్నించింది. ఆదివారం ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపకుండా అధికారులు కక్షగట్టి కూల్చివేస్తున్నారని మండిపడింది. ‘‘హైడ్రాను అభినందిస్తున్నాం.. కానీ హైడ్రా వ్యవహరిస్తున్న తీరు బాగులేదు’’ అని హైకోర్టు పేర్కొంది.
కామన్ మ్యాన్‌కు ఏం మెసేజ్ ఇస్తున్నారు..
‘‘అంత హడావుడి ఎందుకు ఆదివారం కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలు జరిగితే గ్రామపంచాయతీ స్పందించాలి.. గ్రామపంచాయతీ చర్యలు తీసుకోవాలి..కట్టకుండా.. కడితే సీజ్ చెయ్యాలి.. నిబంధనలు ఫాలో కావాలి.. హైడ్రా అభినందనీయం కానీ.. రూల్స్ ఫాలో కావాలి.. ఆదివారం కూల్చివేతలు సరికావు.. ఆదివారం కూల్చివేతలపై కామన్ మ్యాన్‌కు ఏమని మేసేజ్ ఇస్తున్నారు.. చార్మినార్ తహసీల్దార్ హైకోర్టును కూల్చలంటే హైడ్ర మేషనరీ పంపిస్తారా.. తహసీల్దార్, హైడ్రా కౌంటర్ దాఖలు చేయండి’’ అంటూ ఆదేశించింది. హైడ్రా కమిషనర్ వాదనలకు న్యాయస్థానం ఏకభవించలేదు. కూల్చివేతలకు సంబంధించి వీడియోలు ఫైల్ చెయాలని... నిబంధనలు ఫాలో అవుతూ కూల్చాలని హైడ్రా, తహసీల్దార్‌కు సూచించింది. రాత్రికి రాత్రే కూల్చివేతలు సరికావని పేర్కొంది. ఉన్నదాన్ని కాపాడుకోవడానికే హైడ్రా దృష్టి పెట్టాలని హితవుపలికింది. చెరువులపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిపింది. ‘‘అందరినీ చంచల్ గూడ, చర్లపల్లి పంపిస్తే అప్పుడు అర్ధం అవుతుంది’’ హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
Telangana Tourism: తక్కువ బడ్జెట్‌తో వీకెండ్ ట్రిప్.. తెలంగాణ మినీ మాల్దీవులు బెస్ట్
హ్యాపీగా లేమన్న ధర్మాసనం..
‘‘హైడ్రా విషయంలో మేము హ్యపీగా లేము. హైడ్రా ఏర్పాటు మీద రెండు పిటిషన్‌లు ఉన్నాయి. ఇష్టానుసారంగా చేస్తే జీవో 99 పై స్టే విధించాల్సి వస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా. హైడ్రా అంటే కేవలం కూల్చివేత చేయడమేనా. ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దు. పెద్ద, పేద ప్రజల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా లేదా నిజయితీగా చెప్పండి. ట్రాఫిక్ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు. మూసి విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటి. మూసి మీద ఈరోజు 20 పిటిషన్‌లు ఉన్నాయి’’ అని హైకోర్టు పేర్కొంది. అలాగే హైడ్రా కమిషనర్ , అమీన్ పూర్ ఎమ్‌ఆర్‌వోకు కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కాగా.. కోర్టు పరిధిలో ఉన్న భవనాలను హైడ్రా కూల్చడం పై గత విచారణలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోర్టుకు హాజరుకావాలని హైడ్రా కమిషనర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో నేడు విచారణకు రంగనాథ్ హాజరయ్యారు.
గత విచారణలో..
అన్ని అనుమతులు పొంది, ఆస్తులు విక్రయించి, అప్పులు తెచ్చి హాస్పిటల్ కోసం ఐదంతస్తుల భవనాన్ని నిర్మించామని.. భూ ఆక్రమణ చట్టం-1905 కింద 48 గంటల నోటీసు ఇచ్చి 13 గంటల్లో భవనాన్ని కూల్చేశారని పేర్కొంటూ మహమ్మద్ రఫీ, ఎన్.వెంకట్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం (సెప్టెంబర్ 27) విచారణ చేపట్టింది. అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును గత విచారణలో హైకోర్టు తప్పుపట్టింది. ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ భవనాన్ని ఎలా కూల్చారని నిలదీసింది. ఏ అధికారం, ఏ చట్టప్రకారం ఇళ్ల కూలివేతలు చేపడుతున్నారో చెప్పాలంటూ హైడ్రాకు ఆదేశాలు జారీచేసింది.
కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండగా, జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ పంచాయతీ శ్రీకృష్ణనగర్ ప్లాట్ నెంబర్ 92 (సర్వే నంబరు 165, 166)లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ భవనాన్ని ఈ నెల 22న కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఆదివారం నాడు కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ బాధితులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉదయం 7.30 గంటలకు కూల్చివేతలు చేపట్టడం అక్రమమని పేర్కొంది. ఏ అధికారంతో ఇలా చేస్తున్నారో స్వయంగా వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. కమిషనర్ రంగనాథ్, అమీన్‌పూర్ తహసీల్దార్ ప్రత్యక్షంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ ఈ నెల 30న హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.
ఇవి కూడా చదవండి...
ED: ఈడీ అదుపులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ
Harish Rao: 1962 సేవల పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఫైర్
Read Latest Telangana News And Telugu News