Share News

Hyderabad Police: రాత్రివేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఉచిత ప్రయాణం.. నిజమేనా?

ABN , Publish Date - Aug 22 , 2024 | 04:48 PM

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మహిళలు ప్రయాణం చేయాల్సి వస్తే, పోలీసులకు ఫోన్‌ చేస్తే ఉచితంగా గమ్యస్థానానికి చేరుస్తారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతుంది. ఆ అంశంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

Hyderabad Police: రాత్రివేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఉచిత ప్రయాణం.. నిజమేనా?
Hyderabad women

హైదరాబాద్ : సోషల్ మీడియా పుణ్యమా అని.. నిజమైన వార్తలేంటో, నకిలీవేంటో తెలుసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని వార్తలైతే అకస్మాత్తుగా వైరల్ అవుతాయి. వాటిలో నిజానిజాలు పట్టించుకోకుండా ప్రజలు నమ్మేస్తున్నారు. విద్యావంతులు సైతం వాటిని నమ్ముతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వార్త ఏదైనా, సమాచారం ఏదున్నా.. ముందుగా ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవడం ముఖ్యం.

దీన్నే ఫ్యాక్ట్ చెక్(Fact Check) అని అంటారు. తద్వారా వార్త నిజమా కాదా అనేది క్షణాల్లో తెలిసిపోతుంది. కానీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే ఇది సాధ్యపడుతుంది. కానీ కొందరు వ్యూస్, పబ్లిసిటీ కోసం ఫేక్ న్యూస్‌లను కావాలనే వ్యాప్తి చేస్తున్నారు. అవి నిజమో, అబద్ధమో తెలుసుకోకుండా చాలా మంది షేర్ కూడా చేసేస్తున్నారు. వాటికి కౌంటర్‌గా మరికొందరు తప్పుడు సమాచారం అంటూ కొట్టిపారేస్తున్నారు. తాజాగా ఇలాంటి సమాచారమే హైదరాబాద్‌లో క్షణాల్లో వైరల్ అయింది.


రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మహిళలు ప్రయాణం చేయాల్సి వస్తే, పోలీసులకు ఫోన్‌ చేస్తే ఉచితంగా గమ్యస్థానానికి చేరుస్తారనేది ఆ వార్త సారాంశం. 1091, 7837018555 నంబర్లకు కాల్ చేస్తే, స్థానిక పోలీసుల వాహనం వారిని గమ్యస్థానాలకు చేరుస్తుంది అని సదరు వార్తలో ఉంది. ఇది నిజమో, కాదో పక్కనపెడితే.. చాలా మంది ఆ నంబర్లకు కాల్ చేస్తున్నారట. చివరకు ఈ విషయం హైదరాబాద్ పోలీసు శాఖకు తెలిసింది.

ఈ వార్తలో నిజానిజాలపై పోలీసులు గురువారం స్పష్టతనిచ్చారు. రాత్రి వేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరుతో వైరల్ అవుతోన్న వార్త ఫేక్ అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని సూచించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మేముందు నిర్ధారించుకోవడానికి సదరు విభాగం అధికారిక వెబ్‌సైట్స్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని చెక్ చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి...

TG News:10 ఐ ఫోన్లను ఆ కొరియర్ బాయ్ ఏం చేశాడో తెలుసా!

Konda muarali: బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఫైర్

Read Latest Telangana News

Updated Date - Aug 22 , 2024 | 05:09 PM