Manchu Vishnu: టాలీవుడ్‌లో వివాదాస్పద పరిణామాలపై విష్ణు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:54 AM
Manchu Vishnu: మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉంటారని మా అధ్యక్షులు మంచు విష్ణు తెలిపారు. మన చిత్ర పరిశ్రమ సహకారం, సృజనాత్మకతపై ఆధారపడి నడిచే పరిశ్రమ అని చెప్పుకొచ్చారు. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల చిత్ర పరిశ్రమ ఎంతో ఎదిగిందని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 25: ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు టాలీవుడ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపులు తదితర అంశాలు తెలుగు చిత్ర పరిశ్రమ గురించి తీవ్రంగా చర్చించుకునేలా చేశాయి. ముఖ్యంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట వ్యవహారం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏకంగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కూడా పెను దుమారాన్ని రేపాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుదలైన తర్వాత.. ఆయనను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించడాన్ని సీఎం తప్పుబట్టారు. అల్లు అర్జున్‌కు ఏమైందని అంతా పరామర్శించడానికి వెళ్లారని ప్రశ్నిస్తూ.. మృతురాలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. పలువురు రాజకీయ నాయకులు కూడా అల్లు అర్జున్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
విష్ణు సూచనలు..
ఈ క్రమంలో టాలీవుడ్‌లో ఇటీవల నెలకొన్న పలు వివాదాస్పద పరిణామాల నేపథ్యంలో సభ్యులకు మా అధ్యక్షుడు మంచువిష్ణు పలు సూచనలు చేశారు. మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉంటారని తెలిపారు. మన చిత్ర పరిశ్రమ సహకారం, సృజనాత్మకతపై ఆధారపడి నడిచే పరిశ్రమ అని చెప్పుకొచ్చారు. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల చిత్ర పరిశ్రమ ఎంతో ఎదిగిందని తెలిపారు. ప్రత్యేకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడటానికి అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనదని వెల్లడించారు. ఈ విధంగా ప్రతి ప్రభుత్వంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.
Kakani: అధికారంలోకి వచ్చాక అంతుచూస్తాం.. కాకాణి దౌర్జన్యం
అయితే ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలలో పక్షాలు తీసుకోవడాన్ని గానీ నివారించాలని కోరారు. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి అని.. వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుందని తెలిపారు. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుందన్నారు. ఈ సమయంలో అందరికీ సహనం, సానుభూతి, మరియు సంఘ ఐక్యత అవసరమన్నారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాంమన్నారు. ఏ సమస్యలు వచ్చినా అంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని మా అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
Read Latest Telangana News And Telugu News