Mallu Ravi: శ్రీరామ ప్రాణప్రతిష్ఠకు రాష్ట్రపతి ముర్ము ఎందుకు రాలేదు
ABN , Publish Date - Jan 22 , 2024 | 07:24 PM
అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ( Draupadi Murmu ) ఎందుకు రాలేదని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ( Mallu Ravi ) ప్రశ్నించారు.
హైదరాబాద్: అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ( Draupadi Murmu ) ఎందుకు రాలేదని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ( Mallu Ravi ) ప్రశ్నించారు. సోమవారం నాడు సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... భారత దేశ రాష్ట్రపతి గిరిజన మహిళ అని అందుకనే ఆమెను ఆహ్వానించ లేదా అని నిలదీశారు. స్వాతంత్రం రాకముందు ఎస్సీ, ఎస్టీలను దేవాలయాలకు రానివ్వకపోవడంతో పోరాటాలు జరిగాయని చెప్పారు. మళ్లీ స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా గిరిజన మహిళ అయిన ప్రెసిడెంట్‌ను ఎందుకు పిలవ లేదని ప్రశ్నించారు.
శ్రీరాముడి రాజ్యంలో అందరూ సమానులే..
పార్లమెంట్, అయోధ్య కార్యక్రమాలకు ప్రెసిడెంట్‌కు పిలుపు లేకపోవడం అవమానమేనని చెప్పారు. శ్రీరాముడి రాజ్యంలో అందరూ సమానులేనని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా రామాయణాన్ని ప్రజలకు తెలియజేస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారని అన్నారు.దేశంలో రాముడు, హనుమాన్ దేవాలయం లేని గ్రామం ఉండదన్నారు. రాముడి చరిత్ర పిల్లాడిని అడిగినా చెప్తాడని.. మోదీ కొత్తగా చెప్పాల్సిన పనిలేదన్నారు. అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశ ప్రజలందరికీ సమానంగా న్యాయం చేయాలని కోరుతున్నానని మల్లు రవి తెలిపారు.