Pralhad Joshi: నీతి ఆయోగ్ సమావేశాన్ని రేవంత్ బహిష్కరించడమేంటీ.. ?
ABN , Publish Date - Jul 27 , 2024 | 03:31 PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించటంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో కేంద్రమంత్రి శనివారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రహ్లాద్ జోషి చర్చించారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించటంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Minister Pralhad Joshi) తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో కేంద్రమంత్రి శనివారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రహ్లాద్ జోషి చర్చించారు. అనంతరం హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీపై ప్రహ్లాద్ జోషి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read: Hari Rama Jogaiah: హరిరామ జోగయ్య మళ్లీ స్టార్ట్ చేశారు.. ఈసారి చంద్రబాబును కూడా..
బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది..
కాంగ్రెస్ హయాంలో ఏపీ, తెలంగాణకు కలిపి రూ.5 నుంచి 6 వేల కోట్లు మాత్రమే గ్రాంట్లు వచ్చాయన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రూ.26వేల కోట్లను గ్రాంటుల రూపంలో ఇచ్చిందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం అబద్ధాలు చెప్పిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం మాదిరి వ్యవహరిస్తే.. కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం తప్పులను సరిచేసుకోవాలని ప్రహ్లాద్ జోషి హితవు పలికారు.
Also Read: Telangana Assembly: ‘హాఫ్ నాలెడ్జ్.. డమ్మీ’.. అసెంబ్లీలో హరీష్ vs కోమటిరెడ్డి..
అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్
అద్బుతమైన బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మోదీ సారథ్యంలో ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్ నిలిచిందని అన్నారు. అన్నీ రాష్ట్రాలకు మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ఈ ఏడాది రూ.5వేల కోట్లకు పైగా రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించామని తెలిపారు. రూ.48వేల కోట్ల రోడ్డు ప్రాజెక్టులు తెలంగాణలో నడుస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తే మరిన్ని రోడ్లను విస్తరిస్తామని అన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను నిలపడానికి కృషి చేస్తున్నామని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: రామదాస్
మరోవైపు.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం (Central Govt) కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామదాస్ అథవాలే (Ramdas Athawale) తెలిపారు. శనివారం నాడు మెదక్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి రామదాస్ అథవాలే , మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాస్ అథవాలే మాట్లాడుతూ... కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాజిక, ఆర్థిక న్యాయం దిశగా ఉందని ఉద్ఘాటించారు. సబ్ కా సాత్ సబ్‌కా వికాస్ కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండా ముద్ర రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు వ్యాఖ్యానించారు. ఉజ్వల యోజన పథకం ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం ద్వారా పేదలకు 3 కోట్ల ఇల్లు ఇచ్చామని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని వివరించారు. దేశంలోని 85 శాతం మంది పేదల కోసం మోదీ సర్కార్ పనిచేస్తుందని రామదాస్ అథవాలే పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth: హరీష్‌రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ గట్టి కౌంటర్
Bandi Sanjay: కాళేశ్వరం వెళ్లి ఏం సాధించావ్ కేటీఆర్..
Damodara Rajanarasimha: 317 జీవోతో నష్టపోయిన వారి వివరాలివ్వండి
Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!
Read Latest Telangana News And Telugu News