Share News

TS News: ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మహిపాల్

ABN , Publish Date - Jul 02 , 2024 | 01:52 PM

Telangana: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యేపై ఈడీ కేసు నమోదు చేసింది. అలాగే మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు మహిపాల్ ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేశారు.

TS News: ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మహిపాల్

హైదరాబాద్, జూలై 2: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipalreddy) మంగళవారం ఈడీ (ED) ఎదుట హాజరయ్యారు. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యేపై ఈడీ కేసు నమోదు చేసింది. అలాగే మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు (ED Officers) సోదాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు మహిపాల్ ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు రూ.300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి (TS Government) నష్టం వాటిల్లే విధంగా చేశారని ఆరోపించారు.

Surya Catch Row: క్యాచ్ వివాదం.. బౌండరీ లైన్‌ని వెనక్కు నెట్టారా.. అసలు నిజం ఇది!


వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు సోదరుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపణలు వచ్చాయి. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం నిర్వహిస్తున్నారు. దాదాపు రూ.39 కోట్ల రూపాయల వరకు టాక్స్ ఎగ్గొట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్‌లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్‌తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ సోదరులు మైనింగ్ నిర్వహించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి....

TS News: టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తం

Chandrababu: చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి లంచం అడిగిన డిప్యూటీ సర్వేయర్‌పై వేటు

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 02 , 2024 | 02:43 PM