Share News

Harish Rao: చంద్రబాబు అత్యంత శక్తివంతుడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన చేతిలోనే..

ABN , Publish Date - Jul 02 , 2024 | 01:13 PM

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించడానికి లేఖ రాయడం సంతోషకర పరిణామమని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్‌ను ఏపీలో కలిపారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పగించారన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి చొరవ చూపాలని చంద్రబాబు అన్నారు.

Harish Rao: చంద్రబాబు అత్యంత శక్తివంతుడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన చేతిలోనే..

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించడానికి లేఖ రాయడం సంతోషకర పరిణామమని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్‌ను ఏపీలో కలిపారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పగించారన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి చొరవ చూపాలని చంద్రబాబు అన్నారు. ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు రప్పించడానికి ప్రయత్నం చేయాలన్నారు. దీన్నే మొదటి ఎజెండాగా పెట్టాలన్నారు. ఏడు మండలాలు ఇచ్చిన తర్వాతనే మిగిలిన అంశాలపై ముందుకు వెళ్లాలని హరీష్ రావు అన్నారు. చంద్రబాబు అత్యంత శక్తి వంతుడని.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.


ఈ ప్రభుత్వం రెండు నెలల పెన్షన్ బకాయి పడిందన్నారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు పెన్షన్ పెంచితే.. మన సీఎం మాత్రం రెండు నెలలు బకాయి పడ్డారన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ప్రభాకర్ అనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని.. ఆయన ఆత్మహత్య చాలా హృదయ విదారకంగా ఉందన్నారు. రాష్ట్రంలో పరిస్థితికి ప్రభాకర్ ఆత్మహత్య నిదర్శనమన్నారు. ప్రభాకర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని హరీష్ రావు అన్నారు. ఎమ్మార్వో, కలెక్టర్, ఎస్‌ఐ ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఏ ఒక్కరు పట్టించుకున్నా ప్రభాకర్ ప్రాణాలు దక్కేవన్నారు. బాద్యుల పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని హరీష్ రావు అన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 01:13 PM