Rave party: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:36 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్‌లోఈ రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు.. విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ సైతం పోలీసులు స్వాధీనం..పట్టుబడినవారిపై U/S 34A, 34(1), R/w 9 Of ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు..
హైదరాబాద్: శివారు జన్వాడలోని (Janwada) జరుగుతున్న రేవ్ పార్టీని (Rave party) పోలీసులు భగ్నం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాలకు (Raj Pakala) చెందిన ఫామ్ హౌస్‌లోఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు రాత్రి పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలు,35 మందితో లిక్కర్ పార్టీ జరుగుతోంది. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుగుతోంది. విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10.5 లీటర్స్ విదేశీ మద్యం, 10 లూజ్ ఇండియన్ లిక్కర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిపై U/S 34A, 34(1), R/w 9 Of ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
మద్ధూరి విజయ్ అనే వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్..
ఈ పార్టీలో మద్దూరి విజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి బ్లడ్ శాంపిల్స్‌ని టెస్ట్‌కి పంపిచగా.. కొకైన్ (Cocain) తీసుకున్నట్లు తేలడంతో అరెస్ట్ చేసి ఏటీబీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రేవ్ పార్టీ నిర్వహించిన రాజ్ పాకాలపై ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులతో పాటు ఎక్సైజ్ శాఖ పోలీసులు బృందాలు పాల్గొన్నాయి.
సుద్దపూస.... ఇప్పుడేమంటారో...
బావమర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీలా.. సుద్దపూస... కేటీఆర్ ఇప్పుడేమంటారో... డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తారేమో.. ‘సుద్దపూస‘ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నయ్.. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీసీ పుటేజీసహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాల్సిందేనని.. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలని బండి సంజయ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబర్ 30 నాటికి కుల గణన పూర్తి: మంత్రి పొన్నం
స్వంత నిధులతో ముందడుగు వేసాం: కేటీఆర్
7 గురు ప్రభుత్వ వైద్య కళాశాల పిన్సిపాళ్ల బదిలీ
ఈక్వెనెక్స్ డాటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News