Share News

JNTU: రిజిస్ట్రార్‌ పర్మిషన్‌.. ప్రిన్సిపాల్‌ క్యాన్సిలేషన్‌...

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:28 PM

జేఎన్‌టీయూ(JNTU)లో రిజిస్ట్రార్‌కు, ఉన్నతాధికారులకు మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందా.. అంటే అవుననే అంటున్నారు పలువురు ఉద్యోగులు. తమ విభాగాల నుంచి ముఖ్యమైన ఫైళ్లు రిజిస్ట్రార్‌కు పంపినా, వాటిని క్లియర్‌ చేయకుండా తన వద్దనే అట్టిపెట్టుకుంటున్నారని కొందరు డైరెక్టర్లు రిజిస్ట్రార్‌ తీరును ఆక్షేపిస్తున్నారు.

JNTU: రిజిస్ట్రార్‌ పర్మిషన్‌.. ప్రిన్సిపాల్‌ క్యాన్సిలేషన్‌...

- జేఎన్‌టీయూలో ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్‌

- వీసీ జోక్యానికి అధికారుల విజ్ఞప్తి

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)లో రిజిస్ట్రార్‌కు, ఉన్నతాధికారులకు మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందా.. అంటే అవుననే అంటున్నారు పలువురు ఉద్యోగులు. తమ విభాగాల నుంచి ముఖ్యమైన ఫైళ్లు రిజిస్ట్రార్‌కు పంపినా, వాటిని క్లియర్‌ చేయకుండా తన వద్దనే అట్టిపెట్టుకుంటున్నారని కొందరు డైరెక్టర్లు రిజిస్ట్రార్‌ తీరును ఆక్షేపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతవారం నిబంధనలకు విరుద్ధంగా ఒక కాంట్రాక్టు పద్ధతిలో నియమితుడైన సహాయ ఆచార్యుడిని అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి పంపేందుకు రిజిస్ట్రార్‌(Registrar) పర్మిషన్‌ ఇవ్వడం తాజాగా వివాదాస్పదమైంది.

ఇదికూడా చదవండి: Tungabhadra Express: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని వ్యక్తి మృతి..


వాస్తవానికి ఈ శిక్షణా కార్యక్రమానికి రెగ్యులర్‌ ఫ్యాకల్టీని పంపాలని ఏఐసీటీఈ నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా కాంట్రాక్టు ఫ్యాకల్టీకి అనుమతిస్తూ 22న రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున రద్దు చేస్తున్నట్లుగా వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ 26న ఉత్తర్వులు జారీచేశారు. అనుమతి రద్దు చేసిన అంశాన్ని సదరు కాంట్రాక్టు ఫ్యాకల్టీకి తెలియజేసినప్పటికీ, ప్రిన్సిపాల్‌ ఆదేశాలను కాదని కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఏఐసీటీఈ శిక్షణకు వెళ్లడం.. రెగ్యులర్‌ ప్రొఫెసర్లను, వర్సిటీ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రిన్సిపాల్‌ ఆదేశాలను ధిక్కరించిన కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రెగ్యులర్‌ ఆచార్యులు డిమాండ్‌ చేస్తు న్నారు. రిజిస్ట్రార్‌కు, ఉన్నతాధికారులకు మధ్య ఏర్పడిన అంతరాన్ని తొలగించేందుకు వీసీ చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


నూతన అగ్రిమెంట్‌ పత్రాలకు సర్క్యులర్‌

యూనివర్సిటీలో కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఈ విద్యా సంవత్సరంలో నూతన అగ్రిమెంట్‌ పత్రాలను సమర్పించాలని ఇటీవల ప్రిన్సిపాల్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్‌ 29 వరకు తాము విధులు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ రూ.100 విలువైన నాన్‌-జుడీషియల్‌ స్టాంప్‌ పేపరుపై నిర్ణీత ఫార్మాట్‌లో సంతకం చేసి పంపాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అయితే.. ఇంజనీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న మొత్తం 90మంది కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీలో కేవలం ఆరుగురు మాత్రమే గడువులోగా అగ్రిమెంట్‌ పత్రాలు సమర్పించినట్లు తెలిసింది. గడువు ముగియడంతో అగ్రిమెంట్‌ పత్రాలు సమర్పించని కాంట్రాక్టు ఆచార్యులను తొలగిస్తారా లేదా కొనసాగిస్తారా అనే తేలాల్సి ఉంది. ఈ క్రమంలో సదరు ఫ్యాకల్టీకి జూలై నెల వేతనాల చెల్లింపులోనూ సందిగ్ధత నెలకొం


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2024 | 12:49 PM