Share News

Bank Holiday: రంజాన్‌ రోజు బ్యాంకులకు సెలవా.. కాదా..

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:12 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన బ్యాంకు హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ రోజు బ్యాంకులకు సెలవు ఉంది. అయితే, ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని బ్యాంకులకు మాత్రం సెలవు ఉండదు.

Bank Holiday: రంజాన్‌ రోజు బ్యాంకులకు సెలవా.. కాదా..
Ramzan Eid Bank Holiday

దేశ వ్యాప్తంగా నేడు రంజాన్ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ముస్లిం సోదరులతో మసీదులు కిక్కిరిసిపోతున్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో వారు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, రంజాన్ పండుగ రోజున బ్యాంకులకు సెలవా? కాదా? అన్నది చాలా మందికి ప్రశ్నగా మిగిలిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన బ్యాంకు హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ పండుగ నాడు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు ఉంటుంది. కానీ, బ్యాంకు అకౌంట్ క్లోజింగ్ డే కావటంతో కొన్ని బ్యాంకులు ఓపెన్‌లో ఉండనున్నాయి.


టాక్సులు కట్టే వారి కోసం రిజర్వ్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని బ్యాంకులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. మంగళవారం ఆ బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా మేఘాలయ, చత్తీస్గడ్, మిజోరం, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు తెరిచి ఉంటాయి. కేవలం రిజర్వ్ బ్యాంకు మాత్రమే కాదు.. ఇన్సురెన్స్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్సురెన్స్ కంపెనీలు కూడా సోమవారం పని చేయాలని ఆదేశించింది.


ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవులు

ఏప్రిల్ 5, శనివారం : బాబు జగజ్జీవన రామ్ పుట్టిన రోజును పురష్కరించుకుని శనివారం హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 10, బుధవారం : మహావీర్ జయంతిని పురష్కరించుకుని గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణలో బ్యాంకులకు సెలవు ఉండనుంది.

ఏప్రిల్ 14 , సోమవారం : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది.


ఇవి కూడా చదవండి:

Myanmar earthquake: ఛీ అందరూ భయంతో చస్తుంటే.. ఎంతకు తెగించార్రా..

మార్కెట్‌లోకి వచ్చేసింది

Updated Date - Mar 31 , 2025 | 01:32 PM