Share News

ABN AndhraJyothi: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు చెప్పిన శ్రీహర్షిత

ABN , Publish Date - Dec 04 , 2024 | 03:46 PM

ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహర్షిత.. ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీట్ సాధించారు. కానీ చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఆమె చదువు ఆపేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. చదువుల తల్లిని ఆదుకోమంటూ.. శ్రీహర్షిత దయనీయ కథనాన్ని ప్రసారం చేసింది.

ABN AndhraJyothi: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు చెప్పిన  శ్రీహర్షిత

ఖమ్మం, డిసెంబర్ 04: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు మెడిసిన్‌ విద్యార్థిని శ్రీహర్షిత కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఖమ్మంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను ఆమె కలిశారు. తాను వైద్య విద్య అభ్యసించేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందించిన సహాయం మరచి పోలేమని ఎండీ ఎదుట శ్రీహర్షిత కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్బంగా మెడిసిన్ ఫ్రీ సీట్ సాధించిన శ్రీహర్షితను ఎండీ రాధాకృష్ణ అభినందించారు.

Also Read: ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుంది


ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహర్షిత.. ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీట్ సాధించారు. కానీ చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఆమె చదువు ఆపేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. చదువుల తల్లిని ఆదుకోమంటూ.. శ్రీహర్షిత దయనీయ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనానికి పలువురు స్పందించారు.


ఆ క్రమంలో శ్రీహర్షితను ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చారు. దాతల సహకారంతో.. ఎంబీబీఎస్‌లో శ్రీహర్షిత చేరారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ అందించిన తోడ్పాటుతోనే తాను ఎంబీబీఎస్‌లో చేరడం సాధ్యమైందని శ్రీహర్షిత భావించింది. దీంతో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణను కలిసి వైద్య విద్యార్థి శ్రీహర్షిత కృతజ్ఞతలు చెప్పారు.

For Telangana News And Telugu News

Updated Date - Dec 04 , 2024 | 05:12 PM