Share News

Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

ABN , Publish Date - Oct 04 , 2024 | 03:35 PM

Telangana: రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టమైనా.. ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామని మరోసారి మంత్రి తుమ్మల స్పష్టంచేశారు.

Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు
Minister Thummala Nageshwar rao

కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 4: రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్ (BRS) చేస్తున్న విమర్శలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. కష్టమైనా.. ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామని మరోసారి స్పష్టంచేశారు. అన్ని సబ్సిడీ పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తామని వెల్లడించారు.

NCP MLA Jumped Matralaya: సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకిన ఎమ్మెల్యే



కచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని తేల్చిచెప్పారు. ఏ ఒక్క రైతు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. భారతదేశంలో ఎక్కువ పంటలను సాగు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. మన రాష్ట్రంలో ఒక కోటి 45 లక్షల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని తెలిపారు. ఈ సీజన్లో రైతులు ఎక్కువగా సన్నధాన్యాన్ని పండించారన్నారు. 500 రూపాయలు అదనంగా ఇచ్చి సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

TG highcourt: హైడ్రాపై హైకోర్టుకు కేఏపాల్..


కేటీఆర్ విమర్శలు ఇవే...

కాగా.. రైతు రుణమాఫీకి సంబంధించి మంత్రి తుమ్మలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందన్నారు. వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందని విమర్శించారు. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా చేసి.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం చేశారన్నారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో అని అన్నారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదని.. ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదన్నారు. రాబంధుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోలేని శాపం అంటూ కేటీఆర్ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.


ఇవి కూడా చదవండి..

KTR: రుణమాఫీపై ముఖ్యమంత్రివన్నీ డొల్ల మాటలే..

TG highcourt: హైడ్రాపై హైకోర్టుకు కేఏపాల్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 04 , 2024 | 04:05 PM