ఉజ్జయిని మహంకాళి బోనంలో ‘పురాణపండ’ మంత్రపేటిక కానుక!
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:47 PM
భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వశక్తిమంతమైన అంశాలతో ‘శ్రీ లలితా విష్ణు’ అంశాలు ప్రధాన భూమికలుగా చేసుకుని ఈ ఏటి బోనాల పర్వాల వేళ ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించడానికి ముఖ్య అతిధి స్థానంలో విచ్చేసే ప్రభుత్వ, రాజకీయ, సినీరంగాల భక్తులకు ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అమృతశక్తుల అపురూప రచనాసంకలనాన్ని ఉచితంగా సమర్పించడం మహంకాళి తల్లి అనుగ్రహ విశేషమేనని సికింద్రాబాద్ ఉజ్జయిని మహాహాకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ పేర్కొన్నారు.
సికింద్రాబాద్, జులై 5: భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వశక్తిమంతమైన అంశాలతో ‘శ్రీ లలితా విష్ణు’ అంశాలు ప్రధాన భూమికలుగా చేసుకుని ఈ ఏటి బోనాల పర్వాల వేళ ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించడానికి ముఖ్య అతిధి స్థానంలో విచ్చేసే ప్రభుత్వ, రాజకీయ, సినీరంగాల భక్తులకు ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అమృతశక్తుల అపురూప రచనాసంకలనాన్ని ఉచితంగా సమర్పించడం మహంకాళి తల్లి అనుగ్రహ విశేషమేనని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ పేర్కొన్నారు.
జేష్ఠ అమావాస్య సందర్భంగా అమ్మవారికి శుక్రవారం రాత్రి వందలకొలది భక్తుల సమక్షంలో విశేషార్చలు జరిపిన అనంతరం మహంకాళి తల్లి సమక్షంలో సుమారు మూడు వందల పేజీల వైదిక సంస్కృతీ మంత్ర విశేషాల శ్రీలలితా విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవ గ్రంధాన్ని ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ ఆవిష్కరించి తొలి ప్రతిని మరొక అర్చకులు నారాయణ శర్మకు, మరొక పురోహితులు చందు శర్మకు అందజేశారు.
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర క్షేమం కోరుతూ ‘బియోన్ గ్రూప్’ వారు ప్రచురించిన ఈ గ్రంధం వందల ప్రతులు ఉజ్జయిని మహంకాళి దేవస్థానంకి చేరాయి. సుమారు రెండువందల సంవత్సరాల పైబడి అతి ప్రాచీన ఘన చరిత్ర ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ప్రస్తుత కార్యనిర్వహణాధికారి, సంస్కారసంపన్నులు జి.మనోహర్ రెడ్డి సంపూర్ణ ప్రోత్సాహంతో బోనాల పండుగలవేళ వచ్చే ముఖ్యలకు పవిత్ర జ్ఞాపికగా ఈ అద్భుత గ్రంధాన్ని అందజేస్తామని చెప్పారు.
ఆగమ నిగమాలకు ఆధారమైన అనేక అంశాలతో.. పరవశపు శాంతుల్ని వర్షించే పురాణపండ రసభరిత భక్తి వ్యాఖ్యానాలతో ఈ అమ్మవారి కటాక్షం ఇలా గొప్ప గ్రంధంగా బోనాలకు రెండు రోజుల ముందే సాక్షాత్కరించడం అదృష్టమని రామతీర్థ శర్మ చెప్పడం విశేషం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సేవలో నిత్యం తరించే కంప్యూటర్ ఆపరేటర్ కె. వెంకటేష్ ఈ పవిత్రకార్యాన్ని పర్యవేక్షించారు.
ఇదే సందర్భంలో.. వందల సంవత్సరాల నాగరికతకు సాక్షీభూతంగా నిలిచిన రాజమహేంద్రవరంలోని నల్లమందు సందులో మహావైభవంగా తేజరిల్లుతున్న దశాబ్దాలనాటి శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త అశోక్ కుమార్ జైన్ ఇదే ఉత్తమ ‘శ్రీ లలిత విష్ణు సహస్ర’ మహిమోపేత గ్రంధాన్ని ఆవిష్కరించి.. తొలిప్రతిని ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వేంకట రంగాచార్యులుకు అందజేశారు.
ఈ సందర్భంగా అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ ప్రసన్నపుణ్యమైన ఒక చైతన్యం ఈ దివ్య గ్రంధంలో దర్శనమిస్తోందని పేర్కొంటూ పదునాలుగు లోకాల శ్రీమంతులలో శ్రేష్ఠుడైన శ్రీవేంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలో ఈ అక్షర అక్షయ అమృతాన్ని ఆవిష్కరించే భాగ్యం ప్రసాదించిన పరమాత్మకు కృతజ్ఞతలు తెలిపారు. స్టాండర్డ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్, సంస్కారసంపన్నులు చెన్నాప్రగడ శ్రీనివాస్, హైమావతి దంపుతులు ఈ శ్రీకార్యాన్ని సమర్ధవంతంగా పర్యవేక్షించారు.
శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఆత్మసమర్పణాభావంతో కైంకర్యం చేసే భక్తులకు, పారాయణం చేసే సాధకులకు అశోక్ కుమార్ జైన్ ప్రోత్సాహంతో ఈ మంగళ గ్రంధాన్ని ఉచితంగా అందించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వేంకట రంగాచార్యులు తెలిపారు.
సికింద్రాబాద్ ఆలయంలో ఆవిష్కరించిన శ్రీ సహస్ర సౌందర్య గ్రంధాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంతో తెలంగాణ క్షేమం కోరుతూ బియోన్ గ్రూప్ సమర్పిస్తుండగా, రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వర ఆలయంలో అశోక్ కుమార్ జైన్ ఆవిష్కరించిన ఈ రెండు సహస్ర వైభవాల గ్రంధాన్ని జైనమత మంగళ ప్రార్ధనలైన ‘నవకార మంత్ర’ విశేషంతో అశోక్ కుమార్ జైన్ భక్తకోటికి ఉచితంగా బహూకరించడానికి శ్రీవెంకటేశ్వర ఆలయానికి సమర్పించడం గొప్ప విశేషంగా పురప్రముఖులు, భక్తులు అభినందనలు వర్షిస్తున్నారు.