Share News

పెన్షనర్ల గోడు పట్టకపోవడం దౌర్భాగ్యం

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:27 PM

రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల గురించి పట్టిం చుకోక పోవడం బాధ్యతా రాహిత్యమని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ ఇక్బాల్‌ పాషా, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ బాబు అన్నారు.

పెన్షనర్ల గోడు పట్టకపోవడం దౌర్భాగ్యం

పెన్షనర్ల జేఏసీ నాయకులు

గద్వాలటౌన్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తమకు తాము ప్రజాపాలన అంటూ చెప్పుకుం టున్న రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల గురించి పట్టిం చుకోక పోవడం బాధ్యతా రాహిత్యమని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ ఇక్బాల్‌ పాషా, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ బాబు అన్నారు. క్యాసెలెస్‌ హెల్త్‌ చికిత్సకు సై తం అవస్థలు పడుతున్న పెన్షనర్లు ఉసురు ప్ర భుత్వానికి తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని స్మృతివనంలో పెన్షనర్ల జిల్లా కమిటీ సమావేశం అనంతరం నాయకులు విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రలో ఎన్నడూ కాన రాని రీతిలో ఏకంగా ఐదు డీఏలను పెండింగ్‌ లో ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు, ఇప్పు డు అంటూ ఊరించడం శోఛనీయమన్నారు. మభ్యపెట్టే మాటలు ఎన్నో రోజులు సాగవనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇచ్చిన హామీలు అమలు చేయలేమని, ఖాళీ ఖజానా మీ చేతికే ఇస్తాను... మీరే చేసి చూపించండి అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగినవి కావన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకపోతే అన్ని సంఘాల తో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Updated Date - Mar 19 , 2025 | 11:27 PM