ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:26 PM
ఆశా వర్కర్లకు ఎన్నికల సందర్బంగా కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిండిచిన ఆశాలు
అరెస్టు చేసిన పోలీసులు
గద్వాల క్రైం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్లకు ఎన్నికల సందర్బంగా కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ (సీ ఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయాన్ని ము ట్టడించారు. ఉదయం 6గంటల నుంచి ఆశాకా ర్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముందు చేరుకొ ని ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వా మి, వీవీ నరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ పా ర్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆశా వర్కర్లకు రూ.18వేల కనీస వేతనం ఇస్తానని చెప్పి, ఇప్ప టివరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న ఆశాలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేరు నరసింహ, కాంతమ్మ, పద్మ, నాగప్రమీళ, రేణుక, అభేద, శ్వేత, జయలక్ష్మీ, శ్రీదేవి ఉన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నర్సింగరావులకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు ఆశావర్కర్లు కలెక్టర్ కార్యాలయ గేటు దగ్గర ఉన్న పోలీసులను తోసుకుంటూ గేట్‌ద్వారా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఒక్కసారిగా లోపలికి పరుగులు తీశారు. వెంటనే తేరుకున్న పోలీసు అధికారులు కలెక్టరేట్ లోపల ఉన్న తలుపును మూసి, కార్యాలయంలోకి రా కుండా జాగ్రత్తపడ్డారు.