Share News

Hyderabad: ఎంఎన్‌జేలో వంద రోబోటిక్‌ సర్జరీలు..

ABN , Publish Date - May 24 , 2024 | 03:20 AM

ఎంఎన్‌జే ఆస్పత్రిలో రోబోటిక్‌ శస్త్రచికిత్స విధానం కేన్సర్‌ రోగుల పాలిట వరంగా మారింది. వారికి కొత్త జీవితం ప్రసాదిస్తోంది. గత సెప్టెంబరులో ఆస్పత్రిలో రోబోటిక్‌-అసిస్టెడ్‌ సర్జరీ (ఆర్‌ఏఎస్‌) వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Hyderabad: ఎంఎన్‌జేలో వంద రోబోటిక్‌ సర్జరీలు..

  • కేన్సర్‌ బాధితులకు కొత్త జీవితం

  • ఎంఎన్‌జే డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు

హైదరాబాద్‌ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): ఎంఎన్‌జే ఆస్పత్రిలో రోబోటిక్‌ శస్త్రచికిత్స విధానం కేన్సర్‌ రోగుల పాలిట వరంగా మారింది. వారికి కొత్త జీవితం ప్రసాదిస్తోంది. గత సెప్టెంబరులో ఆస్పత్రిలో రోబోటిక్‌-అసిస్టెడ్‌ సర్జరీ (ఆర్‌ఏఎస్‌) వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నుంచి వంద సర్జరీలు నిర్వహించినట్టు ఎంఎన్‌జే కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ముక్తా శ్రీనివాసులు తెలిపారు. గర్భసంచి, పెద్దపేగు, పురీషనాళం, అన్నవాహిక కేన్సర్‌తో బాధపడుతున్న వారికి రోబోటిక్‌ సర్జరీలు చేశామని చెప్పారు. గురువారం ఆయన ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు.


ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.4 నుంచి 10 లక్షల వరకు ఖర్చయ్యే రోబోటిక్‌ సర్జరీని ఎంఎన్‌జేలో ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. కేన్సర్‌ మొదటి, రెండు, మూడో దశ బాధితులకు ఈ సర్జరీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆస్పత్రిలో రోబోటిక్‌ సర్జరీలో నిష్ణాతులైన నలుగురు వైద్యులు ఉన్నారని, మరో నలుగురు శిక్షణ పొందుతున్నారని చెప్పారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది 40 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు. మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు రోబోటిక్‌ సర్జరీలో శిక్షణ ఇవ్వనున్నట్టు డాక్టర్‌ శ్రీనివాసులు చెప్పారు. వారి పాఠ్యాంశాల్లో ఆర్‌ఏఎస్‌ వంటి సాంకేతికతలను చేర్చాలన్నారు.

Updated Date - May 24 , 2024 | 03:20 AM