IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందు కీలక అప్‌డేట్..ఆయన పేరు తొలగింపు
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:05 PM
ఐపీఎల్ 2025 మ్యాచ్ ప్రారంభానికి ముందే అభిమానులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కామెంట్రీ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్ పేరు తొలగించినట్లు తెలిసింది. అయితే ఎందుకు అలా జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2025లో మ్యాచ్ ప్రారంభానికి ముందు అభిమానులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. లెజెండరీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) కామెంట్రీ ప్యానెల్ నుంచి రెండేళ్లు నిషేధించబడినట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం కామెంట్రీ లిస్ట్ విడుదలైన క్రమంలో అందులో ఇర్ఫాన్ పఠాన్ పేరు లేదు. హిందీ కామెంట్రీ ప్యానెల్లో ప్రతిసారీ ఉండే పేర్లన్నీ ఉన్నాయి. కానీ ఇర్ఫాన్ పేరు మాత్రం ఈసారి కనిపించలేదు. అయితే పఠాన్ కొంతమంది భారత ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఇర్ఫాన్‌ను బహిష్కరించారని తెలిసింది.
ఇర్ఫాన్ పఠాన్ ఔట్
చాలా మంది ఆటగాళ్ళను ఇర్ఫాన్ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పఠాన్‌ను బ్లాక్ చేశారని ఆయా వర్గాలు అంటున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఇర్ఫాన్ పఠాన్ కొంతమంది ఆటగాళ్లపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇది తెలిసిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించబడిన మొదటి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే కాదు. గతంలో భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్, క్రికెట్ నిపుణుడు హర్ష భోగ్లే కూడా ఉన్నారు. 2020లో భారత్ vs దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు మంజ్రేకర్‌ను బీసీసీఐ కామెంట్రీ బృందం నుంచి తొలగించింది. 2019లో సౌరవ్ గంగూలీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినందుకు హర్ష భోగ్లే కూడా శిక్షను ఎదుర్కొవలసి వచ్చింది.
ఇర్ఫాన్ పఠాన్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
IPL 2025 వ్యాఖ్యాత బృందం నుంచి తొలగించబడిన తర్వాత, ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా ద్వారా కొత్త యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. అతను తన షోకు 'సిద్ధి బాత్ విత్ ఇర్ఫాన్ పఠాన్' అని పేరు పెట్టాడు. అభిమానులు తనకు వీలైనంత మద్దతు ఇవ్వాలని కూడా ఆయన అభ్యర్థించారు. మరి పఠాన్ తన ఛానెల్ ద్వారా అలాగే కామెంట్లు కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి మరి. ఈ విషయాన్ని అభిమానులు ఎలా తీసుకుంటానేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
Elon Musk: గ్రోక్ హిందీ తిట్ల వివాదంపై ఎలాన్ మస్క్ రియాక్షన్.. నెటిజన్ల విమర్శలు
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News