కోహ్లీకి గాయం.. రెండో టెస్ట్‌కు డౌట్..

ABN, Publish Date - Dec 04 , 2024 | 07:53 AM

అడిలైడ్: ఆస్ట్రేలియా - భారత్ మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు అడిలైడ్ చేరుకున్న టీం ఇండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. అయితే స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ మోకాలికి బ్యాండేజి వేసుకుని ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అడిలైడ్: ఆస్ట్రేలియా - భారత్ మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు అడిలైడ్ చేరుకున్న టీం ఇండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. అయితే స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ మోకాలికి బ్యాండేజి వేసుకుని ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ రెండో టెస్టులో ఆడుతారా.. లేదా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


టెస్టు వేదిక అడిలైడ్‌కు చేరుకున్న రోహిత్‌ సేన మంగళవారం నెట్స్‌లో తీవ్రంగా సాధన చేసింది. అయితే సెషన్‌ ఆరంభానికి ముందు విరాట్‌ కోహ్లీ కుడి మోకాలికి వైద్య సిబ్బంది బ్యాండేజి కడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయినా రెగ్యులర్‌ వామ్‌పతో పాటు ఫీల్డింగ్‌ డ్రిల్స్‌ కూడా కొనసాగించారు. ఈ సమయంలో అతను పెద్దగా అసౌకర్యంగా ఉన్నట్టు కనిపించలేదు. ఏదిఏమైనా విరాట్‌కు ఏమైందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. టెస్టుకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి చిన్నపాటి గాయమైతే ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. కానీ ముందుజాగ్రత్తగా విరాట్‌కు విశ్రాంతినిస్తే మాత్రం జట్టుకు గట్టిదెబ్బే అని చెప్పవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీం..

బెదిరించి, భయపెట్టి కొట్టేశారు

శ్రద్ధా ఇంటి రెంట్‌ ఎంతో తెలుసా..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 04 , 2024 | 07:53 AM