Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:08 PM
దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ వివరాలు..

ఒకప్పుడు విడాకులు తీసుకోబోతున్నారంటే.. వారిని చాలా విచిత్రంగా చూసేవారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే.. భార్యాభర్తలిద్దరూ కలిసే ఉండాలని నమ్మేవారు. ఇరువైపుల కుటుంబాలు కూడా అదే దిశగా ప్రయత్నాలు చేసేవి. మరి నేటి కాలంలో అంటే.. ఒంటి మీద డ్రెస్ మార్చినంత ఈజీగా విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లై దశాబ్దాలు గడుస్తున్నా.. పిల్లలకు వివాహమై.. మనవలు, మనవరాళ్లు వచ్చిన తర్వాత కూడా విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. ఇక విడాకుల విషయంలో సెలబ్రిటీలు సామాన్యుల కన్నా ముందంజలో ఉన్నారు. నచ్చితే ఓకే.. లేదంటే వెంటనే డైవర్స్ ఇచ్చేయడం సెలబ్రిటీ జంటల్లో కామన్ అయిపోయింది. తాజాగా ఈ జాబితాలోకి మరో సెలబ్రిటీ కపుల్ చేరారు. ప్రపంచ ఛాంపియన్, దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్.. విడాకులు తీసుకోబోతున్నారంట. ఆ వివరాలు..
ఇంగ్లీష్ మీడియా కథనాల ప్రకారం.. మేరీ కోమ్, తన భర్త ఓన్లర్ కరుంగ్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంట. ఇప్పటికే ఈ జంట విడివిడిగా ఉంటున్నారని సమాచారం. 20 ఏళ్ల బంధానికి త్వరలోనే ముగింపు పలుకబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు విడాకులు ప్రక్రియ మొదలు పెట్టలేదని.. త్వరలోనే ఆ ప్రాసెస్ ప్రారంభం కానుందని సమాచారం. 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఈ దంపతుల మధ్య విబేధాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ కథనాల ప్రకారం.. మేరీ కోమ్ భర్త.. ఓన్లర్ 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. దాంతో ఆర్థికపరంగా భారీగా నష్టం వాటిల్లిందని సమాచారం. ఇది కాస్త దంపతుల మధ్య విభేదాలు సృష్టించిందని.. అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాక ప్రస్తుతం మేరీ కోమ్, ఆమె నలుగురు పిల్లలు ఫరీదాబాద్‌లో ఉండగా.. బాక్సర్ భర్త మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నారని తెలుస్తోంది.
మరో వ్యక్తితో బాక్సర్‌కు రిలేషన్..
అయితే మేరీ కోమ్‌కు సంబంధించి ఆంగ్ల మీడియాలో సంచలన వార్తలు వస్తున్నాయి. మేరీ కోమ్ తన భర్త నుంచి విడిపోయిన తర్వాత.. ఆమె బిజినెస్ పార్ట్నర్ హితేష్ చౌదరీతో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ హితేష్ చౌదరీమరో బాక్సర్ భర్త అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడు మేరీ కోమ్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తోన్న తరుణంలో.. హితేష్ తన సోషల్ మీడియాలో మేరీ కోమ్ ఫొటోలు పోస్ట్ చేస్తూ.. వాటికి బలం చేకూరుస్తున్నాడు.
మేరీ కోమ్‌ది ప్రేమ వివాహం. 2000 సంవత్సరంలో మేరీ కోమ్‌కు, ఆమె భర్తకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత 2007లో వివాహం చేసుకున్నారు. మేరీ కోమ్ భర్త.. ఫుట్‌బాల్ ప్లేయర్. కానీ భార్య కోసం తన ప్రొఫెషన్‌ని వదులుకున్నాడు. భార్య బాక్సింగ్ రింగ్‌లో రాణించడం కోసం అతడు కుటుంబ బాధ్యతలు, పిల్లల ఆలనాపాలన వ్యవహారాలు చూసుకునేవాడు. 20 ఏళ్లుగా ఏలాంటి అరమరికలు లేకుండా సాగిన వీరి కాపురంలో ఇప్పుడు కలతలు రేగి.. విడాకులుకు దారి తీసే పరిస్థితులు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి హెచ్‌సీఏ కారణమా.. ఎందుకిలా చేశారు..
వరుడి చెప్పులు దాచి రూ.50 వేలు డిమాండ్..చివరకు దాడి, ఇది కరెక్టేనా..