Share News

అభ్యంతరాలు, అర్జీల పరిష్కారంతో.. టెన్త్‌ మూల్యాంకనం ప్రారంభం

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:29 AM

పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం గురువారం ఏలూరు సెయింట్‌ గ్జేవియర్‌ హైస్కూ లులో ప్రారంభమైంది. ఆయా జిల్లాల నుంచి మూల్యాంకనం నిమిత్తం 1.85 లక్షల వివిధ సబ్జెక్టు జవాబు పత్రాలు అందాయి.

అభ్యంతరాలు, అర్జీల పరిష్కారంతో.. టెన్త్‌ మూల్యాంకనం ప్రారంభం
గ్జేవిఆర్‌ స్కూల్లో టెన్త్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌కు ఎంట్రీ చేసుకుంటున్న ఉపాధ్యాయులు

నేటికి సోషల్‌ స్టడీస్‌ స్పాట్‌ వాయిదా

ఏలూరు అర్బన్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం గురువారం ఏలూరు సెయింట్‌ గ్జేవియర్‌ హైస్కూ లులో ప్రారంభమైంది. ఆయా జిల్లాల నుంచి మూల్యాంకనం నిమిత్తం 1.85 లక్షల వివిధ సబ్జెక్టు జవాబు పత్రాలు అందాయి. ఆ సంఖ్యకు అను గుణంగానే ఈనెల 9నాటికి స్పాట్‌ వాల్యూయేషన్‌ ను ముగించడానికి అవసరమైనసంఖ్యలో ఉపా ధ్యాయ సిబ్బందికి విధులు కేటాయించగా పలు వురు ఆసక్తి కనబరచకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికార వర్గాలు కొంత ఇబ్బందులను ఎదుర్కొ వాల్సి వచ్చింది. పలు అభ్యంతరాలు, అభ్యర్థనలు, మినహాయింపులను పరిష్కరించిన తర్వాత మధ్యా హ్నం 12 గంటల నుంచి కొన్ని సబ్జెక్టుల మూల్యాం కనాన్ని ప్రారంభించారు. అయితే అన్ని సబ్జెక్టుల నుంచి సీఈలు 24 మంది, ఏఈలు 60 మంది, స్పెషల్‌ అసిస్టెంట్లు 33 మంది ఇంకా అవసరమ తారని సాయంత్రానికి గుర్తించిన అధికారులు, ఆ లోటును భర్తీచేయడానికి మండలాల్లో అర్హులైన ఉపాధ్యాయులను గుర్తించి శుక్రవారం స్పాట్‌ డ్యూటీలకు పంపాలని డీవైఈవోలు, ఎంఈవోలను ఆదేశించారు. ఇంగ్లీషు సబ్జెక్టు జవాబుపత్రాల మూల్యాంకనానికి సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్న ట్టు తెలిసింది. ఈ దఫా రెగ్యులర్‌ టెన్త్‌ పరీక్షలతో పాటే సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య పదో తర గతి పరీక్షలను ఒకేసారి నిర్వహించడం, మూల్యాం కనాన్ని ఏకకాలంలో చేపట్టాల్సి రావడంతో ఉపా ధ్యాయ సిబ్బంది కొరత ఏర్పడిందని చెబుతున్నా రు. ఆ ప్రకారం 30 శాతం అదనపు సిబ్బంది సహా మొత్తం 1,309 మందికి స్పాట్‌ డ్యూటీలను కేటా యించారు. వీరిలో అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధు లు, రిటైర్మెంట్‌కు సమీపంలో వున్నవారికి మినహా యింపు సహజంగానే ఇస్తారు. ఇదేకోవలో మరికొం దరు మినహాయింపుల కోసం విద్యాధికారుల వద్దకు క్యూ కట్టడంతో స్పాట్‌ క్యాంపువద్ద రిపోర్టు చేయాల్సిందేనని మైకులో పలుమార్లు హెచ్చరిం చాల్సి వచ్చింది. ఈ క్రమంలో అనారోగ్య కారణాల తో వున్నవారికి మూల్యాంకనం విధులు కేటా యించడంపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) సభ్య సంఘాల నాయకులు కొందరు అభ్యంతరాలను డీఈవో ఎదుట ఉంచారు. స్పాట్‌ క్యాంప్‌లో దిగువస్థాయి సిబ్బంది కొందరు ఉపా ఽధ్యాయులను చులకనగా మాట్లాడుతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. చివరకు పలువురికి మినహా యింపులు ఇచ్చిన అనంతరం, మూల్యాంకనం విధులకు సరిపడా ఉపాధ్యాయ సిబ్బంది నుంచి రిపోర్టు తీసుకుని, సాయంత్రానికల్లా మిగిలిన వారందరికీ రిలీవింగ్‌ ఆర్డర్లు జారీచేసి ఆయా పాఠశాలలకు పంపించి వేశారు. ‘చివరిగా జరిగిన సోషల్‌ స్టడీస్‌ పరీక్ష జవాబు పత్రాలు మూల్యాం కనం నిమిత్తం గురువారం సాయంత్రానికి చేరుకు న్నాయి. వీటికి బార్‌కోడింగ్‌ ఇచ్చిన తర్వాతే మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున శుక్రవారం నుంచి ప్రారంభించేందుకు వీలు గా సోషల్‌ సబ్జెక్టు స్పాట్‌ సిబ్బంది సేవలను ఒక రోజు ఆలస్యంగా వినియోగించుకుంటాం. సహే తుక కారణాలతో అభ్యర్థనలు ఇచ్చినవారందరికీ పరిశీలించి స్పాట్‌ విధులనుంచి మినహాయింపులు ఇచ్చాం. గడువు తేదీలోగానే మూల్యాంకనం ప్రక్రి యను ముగి స్తాం’ అని డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు.

Updated Date - Apr 04 , 2025 | 12:30 AM