Nara Lokesh: లోకేశ్‌ను కలిసిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:18 AM
11 ఏళ్ల టెక్ ప్రతిభావంతుడు అఖిల్ ఆకెళ్ల, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ను కలుసుకున్నారు. మైక్రోసాఫ్ట్ ధృవీకృత ఏఐ, డేటా సెక్యూరిటీ కోర్సుల్లో సర్టిఫికెట్లు పొందిన అఖిల్ అమరావతి ఐటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆసక్తి చూపారు.

అమరావతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల టెక్ సంచలనం.. అఖిల్ ఆకెళ్ల రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. తన తండ్రితో కలిసి శుక్రవారం ఉండవల్లి నివాసానికి వెళ్లిన అఖిల్‌తో లోకేశ్ సుమారు అరగంట సమావేశమయ్యారు. బ్రిటన్‌లో చదువుతున్న అఖిల్ చిన్నవయసులోనే మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా సెక్యూరిటీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికెట్లు సాధించాడు. అమరావతిలో జరగనున్న సమాచార, సాంకేతిక అభివృద్ధిలో భాగమయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో ఆ చిన్నారిని కలుస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అఖిల్‌ను కలిశారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..