Share News

Your Platform magazine: ప్రీమియం రైళ్లలో ‘యువర్‌ ప్లాట్‌ఫామ్‌’ మేగజైన్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:31 AM

దేశంలో ఇలాంటిది మొదట చెన్నైలో ప్రారంభించగా, ఆ తరువాత విశాఖలోనే తీసుకురావడం విశేషం. రైల్వేలో కీలకమైన అంశాలు, మరచిపోలేని ఘటనలు, పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి, అభిరుచులు, అలవాట్లను వివరిస్తూ ఈ ‘ఆంగ్ల మాస పత్రిక’ను రూపొందించామని వాల్తేరు డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా తెలిపారు.

Your Platform magazine: ప్రీమియం రైళ్లలో ‘యువర్‌ ప్లాట్‌ఫామ్‌’ మేగజైన్‌

చెన్నై తరువాత విశాఖలోనే ప్రారంభం

విశాఖపట్నం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): వాల్తేరు రైల్వే డివిజన్‌ అధికారులు ప్రయాణికుల కోసం ‘యువర్‌ ప్లాట్‌ఫామ్‌’ పేరుతో మాసపత్రికను అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశంలో ఇలాంటిది మొదట చెన్నైలో ప్రారంభించగా, ఆ తరువాత విశాఖలోనే తీసుకురావడం విశేషం. రైల్వేలో కీలకమైన అంశాలు, మరచిపోలేని ఘటనలు, పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి, అభిరుచులు, అలవాట్లను వివరిస్తూ ఈ ‘ఆంగ్ల మాస పత్రిక’ను రూపొందించామని వాల్తేరు డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా తెలిపారు. వీటిని ఎంపికచేసిన ప్రీమియం రైళ్లు... విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌, గుంటూరు వెళ్లే డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌, అరకులోయ మార్గంలో ప్రయాణించే కిరండోల్‌ పాసింజర్‌ రైలులోని విస్టాడోమ్‌ కోచ్‌లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. తొలి మాసపత్రికను ‘నమస్కారం వైజాగ్‌’ ముఖచిత్రంతో విడుదల చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌-1 కె.సందీప్‌, మేనేజర్‌-2 పవన్‌ కుమార్‌, మాసపత్రిక సృష్టికర్తలు ప్రవీణ్‌, శంకర్‌, కృతిక్‌ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:31 AM