Share News

Stock Market Update: ఈ వారం సైతం మార్కెట్లో బుల్ వీరంగమేనా!

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:00 PM

నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీకి తొలుత 23,450 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించే వీలున్నట్లు టెక్నికల్‌ విశ్లేషకులు చెబుతున్నారు.అయితే 100 డేస్ మూవింగ్ యావరేజ్ 23,522 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు.

Stock Market Update: ఈ వారం సైతం మార్కెట్లో బుల్ వీరంగమేనా!
Bulls

F&O Talk: గత వారం వరుసగా ఐదు రోజుల పాటు భారీ స్థాయిలో పెరిగిన భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం సైతం అదే తీరు కొనసాగించే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్లకు విదేశీ జోష్‌, ఫెడ్,ఎఫ్‌ఐఐల పెట్టుబడుల బూస్టింగ్ భారీగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా విదేశీ అంశాలు కూడా దోహదపడనున్నట్లు చెబుతున్నారు. మరోవైపు, మార్చి ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులు ముగింపు ఉండటంతో ఈ వారం మార్కెట్లలో అధిక ఓలటాలిటీ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయని చెబుతున్నారు.


నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీకి తొలుత 23,450 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించే వీలున్నట్లు టెక్నికల్‌ విశ్లేషకులు చెబుతున్నారు.అయితే 100 డేస్ మూవింగ్ యావరేజ్ 23,522 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 23,600 స్థాయి కీలకంకాగా ఉండే అవకాశం ఉందని 23,700, 23,800ను అధిగమిస్తే నిఫ్టీ మరింత బలపడవచ్చని భావిస్తున్నారు. అయితే, స్వల్పకాలంలో 24,069 వద్ద తీవ్ర అవరోధం ఎదురుకావచ్చని అంచనా కడుతున్నారు.

ఇవి కూడా చదవండి...

Attack On Bollywood Actress: షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటికి ఊహించని షాక్

Hyderabad Explosion: హైదరాబాద్‌లో భారీ పేలుడు... ఏం జరిగిందంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 12:05 PM