Share News

Posani Krishna Murali: పోసానికి షరతులతో బెయిల్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:07 AM

ఈ కేసులో గుంటూరు జిల్లా పోలీసులు గతవారం పోసానిని పీటీ వారెంట్‌పై కర్నూలు నుంచి తీసుకువచ్చి గుంటూరు సీఐడీ కేసుల స్పెషల్‌ కోర్టులో హాజరు పరిచారు. దీంతో న్యాయాధికారి పోసానిని జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. ప్రస్తుతం కృష్ణ మురళి గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. కాగా, ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సాయంత్రం మెజిరేస్టట్‌ స్పందన ఉత్తర్వులు జారీ చేశారు.

Posani Krishna Murali: పోసానికి షరతులతో బెయిల్‌

గుంటూరు(లీగల్‌), మార్చి 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు మార్ఫింగ్‌ ఫొటోలను చూపుతూ అసభ్య పదజాలంతో దూషించిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో గుంటూరు జిల్లా పోలీసులు గతవారం పోసానిని పీటీ వారెంట్‌పై కర్నూలు నుంచి తీసుకువచ్చి గుంటూరు సీఐడీ కేసుల స్పెషల్‌ కోర్టులో హాజరు పరిచారు. దీంతో న్యాయాధికారి పోసానిని జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. ప్రస్తుతం కృష్ణ మురళి గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. కాగా, ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సాయంత్రం మెజిరేస్టట్‌ స్పందన ఉత్తర్వులు జారీ చేశారు. పోసానికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. రూ.లక్ష చొప్పున ఇరువురు వ్యక్తులతోపాటు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. చార్జిషీటు దాఖలు చేేస వరకు గుంటూరు సీఐడీ రీజినల్‌ ఆఫీసులో రెండు వారాలకోసారి హాజరు కావాలని షరతు విధించారు. పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:07 AM

News Hub