Share News

GT vs PBKS: గుజరాత్ జట్టులో విపరాజ్ నిగమ్ లాంటి చిచ్చర పిడుగు.. తేలికగా తీసుకుంటే పంజాబ్‌కు మూడినట్లే

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:34 PM

బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ నితీష్ కుమార్.. ఇలా ఎంతో మంది ప్రతిభావంతులు ఐపీఎల్ ద్వారా ఆకట్టుకుని స్టార్స్ అయ్యారు. తాజాగా ఐపీఎల్ మొదలై నాలుగు రోజులు అయింది. ఈ నాలుగు రోజుల్లోనే ఇద్దరు కుర్రాళ్లు అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

GT vs PBKS: గుజరాత్ జట్టులో విపరాజ్ నిగమ్ లాంటి చిచ్చర పిడుగు.. తేలికగా తీసుకుంటే పంజాబ్‌కు మూడినట్లే
Manav Suthar

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎందరో ప్రతిభావంతులును వెలుగులోకి తీసుకొస్తోంది. బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ నితీష్ కుమార్.. ఇలా ఎంతో మంది ప్రతిభావంతులు ఐపీఎల్ ద్వారా ఆకట్టుకుని స్టార్స్ అయ్యారు. తాజాగా ఐపీఎల్ మొదలై నాలుగు రోజులు అయింది. ఈ నాలుగు రోజుల్లోనే ఇద్దరు కుర్రాళ్లు అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఒకరు ముంబై తరఫున ఆడుతున్న విఘ్నేష్ పుత్తుర్ కాగా, మరొకరు ఢిల్లీ తరఫున ఆడుతున్న విప్రాజ్ నిగమ్ (Vipraj Nigam).


అరంగేట్ర మ్యాచ్‌లోనే విప్రాజ్ ఆకట్టుకున్నాడు. ఈ యువ ఆల్ రౌండర్ సోమవారం లఖ్‌నవూ‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో మార్‌క్రమ్ వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ సమయంలో 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. విప్రాజ్ బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఢిల్లో 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో బ్యాటింగ్‌కు దిగిన విప్రాజ్ గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విప్రాజ్‌ను ఢిల్లీ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. బ్యాటర్‌గా, లెగ్-స్పిన్నర్‌గా సత్తా చాటుతున్నాడు.


మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. గుజరాత్ టీమ్‌లో కూడా విప్రాజ్ తరహా ఆటగాడు ఒకరు ఉన్నారు. అతడి పేరు మనవ్ సుతార్. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను గుజరాత్ టీమ్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. రాజస్తాన్‌కు చెందిన మనవ్ తన స్పిన్ బౌలింగ్‌లో ఫ్లైట్, టర్న్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ మనవ్ సత్తా చాటగలడు. అయితే ఇప్పటివరకు మనవ్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. మరి, మనవ్ కూడా విప్రజ్ తరహా ప్రదర్శనను కనబరిస్తే గుజరాత్ కూడా బలమైన జట్టుగా మారుతుందనడంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి..

Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక


Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..


MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 05:32 PM