Amaravati government residences: అదిగదిగో అమరావతి చకచకా సర్కారు బంగళాలు!
ABN , Publish Date - Mar 30 , 2025 | 03:48 AM
అమరావతి రాజధానిలో ఉన్నతాధికారుల నివాసాల నిర్మాణ పనులు మళ్లీ వేగం పెంచుకున్నాయి. రాయపూడిలో 115 సెక్రటరీల బంగళాలు నిర్మించేందుకు కేఎంవీ ప్రాజెక్ట్స్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుని పనులను ప్రారంభించింది.

కొలిక్కి వస్తున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల నివాస భవనాలు
పూర్తయినవాటిలో ఇంటీరియర్, ఎలక్ర్టిఫికేషన్ ప్రారంభం
బ్యాలెన్స్ పనులకు వీలుగా చదును, నిర్మాణ పనులకు సిద్ధం
భారీ సంఖ్యలో పొక్లెయిన్లతో పిచ్చి మొక్కల తొలగింపు
త్వరలో బేస్‌మెంట్ నిర్మాణాల్లో పురోగతి
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
అమరావతి రాజధానిలో ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఒక రూపు దిద్దుకుంటున్నాయి. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల బంగళా పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాయపూడిలో ఒక్కొక్కటి 5,90,761 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్-1 విధానంలో మొత్తం 115 ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీల బంగళాల పునర్నిర్మాణ పనులు కొద్దిరోజులుగా ఊపందుకున్నాయ. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ పనులు చేపట్టినా వైసీపీ ప్రభుత్వ పాలనలో వివిధ స్థాయిల్లో ఆగిపోయియి. ఇటీవలే సీఆర్‌డీఏ అధికారులు ఈ పనుల పునర్నిర్మాణానికి వీలుగా రూ.411.39 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా, కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (కేఎంవీపీఎల్) సంస్థ అతి తక్కువకు కోట్ చేసి ఎల్-1 గా నిలిచి కాంట్రాక్టు దక్కించుకుంది. దీంతో రెండేళ్లలో ఈ భవనాల పనులు పూర్తి చేయాల్సిందిగా సీఆర్‌డీఏ నిర్దేశిస్తూ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎల్‌ఓఏ) అందించింది. ఈ క్రమంలో కేఎంవీ సంస్థ క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగింది. అంతకు ముందు బంగళాలను కప్పేసిన కంపను చాలా వరకు సీఆర్‌డీఏ అధికారులు తొలగించినా.. ఆ తర్వాత మళ్లీ కంప, పొదలు పెరిగిపోయాయి. కాంట్రాక్టు సంస్థ భారీ ఎత్తున పొక్లెయిన్లను సిద్ధం చేసి ఆయా బంగళాలను చుట్టేసిన పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించింది. బ్యాలెన్సు పనులను ప్రారంభించడానికి వీలుగా చక్కగా చదును చేసింది. ప్రస్తుతం స్ట్రక్చర్ పూర్తయిన బంగళాలపై దృష్టి సారించింది. వీటిలో ఇంటీరియర్, ఫ్లోరింగ్, సీలింగ్, ఎలక్ర్టికల్, ప్లంబింగ్, పెయింటింగ్ వంటి పనులు చకచకా చేసుకుంటూ వస్తోంది. ఈ పనులు పూర్తి కాగానే ఫ్లోరింగ్ పనులు చేపడతారు. బిలో బేస్‌మెంట్, బేస్‌మెంట్ దశల్లో ఉన్న వాటికి సంబంధించి స్ట్రక్చర్ పనులు చేపడతారు. ప్రభుత్వం నిర్దేశించిన టెండర్ల ప్రకారం ఫైల్ ఫౌండేషన్, ఆర్‌సీ కాలమ్స్ - బీమ్స్‌తో కూడిన సూపర్ స్ట్రక్చర్, ఇంటర్నల్ ఎలక్ర్టికల్, ప్లంబింగ్, ఐటీ, హోమ్ ఆటోమేషన్ తదితర పనులను చేపడతారు. అనంతరం పెయింటింగ్ వేసిన తర్వాత వాటర్ సప్లై, వీధి దీపాలు, రోడ్లు వంటి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News