water problem తాగునీటి సమస్య పరిష్కరించండి
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:20 AM
తమకాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక అశోక్‌నగర్ కాలనీవాసులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో బుధవారం నిరసన చేపట్టారు.

ఓబుళదేవరచెరువు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): తమకాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక అశోక్‌నగర్ కాలనీవాసులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో బుధవారం నిరసన చేపట్టారు. కాలనీ వాసులు రేణుకా, జయమ్మ, ఈశ్వరమ్మ, శివమ్మ తదితరులు మాట్లాడుతూ.. కాలనీలో 50 ఇళ్లు ఉన్నాయని, వాటి అన్నింటికి కలిపి ఒక కొళాయి మాత్రమే ఉందని, ఆ కొళాయిలో కూడా నీరు సరిగా రావడంలేదని వాపోయారు. తమ కాలనీలోనే మరిన్ని ప్రాంతాల్లో కొళాయిలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. వీరికి మద్దతుగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు, మండల కార్యదర్శి చలపతినాయుడు నిరసనలో పాల్గొన్నారు. ఎంపీడీఓ రాబర్టు విల్సన స్పందిస్తూ.. అదనంగా కొళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.