Share News

SHORT CITUIT : షార్ట్‌ సర్క్యూట్‌తో మామిడి తోట దగ్ధం

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:14 AM

విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి మండల కేంద్రం సమీపంలోని మామిడి తోట మొత్తం కాలిపోయింది. మండలకేంద్రానికి చెందిన పున్న పు లక్ష్మీనారాయణ అనే రైతు దా దాపు నాలుగెకరాల్లో మామిడి చెట్లను పెంచుతున్నాడు. రోజు లాగానే రైతు బుధవా రం పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్లాడు.

SHORT CITUIT :  షార్ట్‌ సర్క్యూట్‌తో మామిడి తోట దగ్ధం
Burnt mango trees and drip equipment

నార్పల, మార్చి 19(ఆంధ్రజ్యోతి): విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి మండల కేంద్రం సమీపంలోని మామిడి తోట మొత్తం కాలిపోయింది. మండలకేంద్రానికి చెందిన పున్న పు లక్ష్మీనారాయణ అనే రైతు దా దాపు నాలుగెకరాల్లో మామిడి చెట్లను పెంచుతున్నాడు. రోజు లాగానే రైతు బుధవా రం పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్లాడు. ఇంతలోగా తోటపై భాగాన ఉన్న విత్యుత తీగలు ఒకదానికొకటి తగులుకొని నిప్పురవ్వలు చె ట్లపై పడ్డాయి. దీంతో మంటలు చెలరేగి మామిడి చెట్లు, డ్రిప్పు పరికరాలు పూర్తిగా కాలిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశా డు. పంటకోసే సమయంలో ఇలా జరిగిందని, దాదాపు రూ. 10లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపాడు. ప్రభుత్వం అదు కోవాలని రైతు కోరాడు. మామిడి తోటను రెవెన్యూ అధికారు లు పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. నివేదికను పై అధికారులకు పంపుతామని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 20 , 2025 | 12:14 AM