Former జయమ్మ పొలాన్ని పరిశీలించిన అధికారులు
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:12 AM
మహిళా రైతు జయమ్మ సమస్యపై అధికారులు స్పందించారు. పొలానికి వెళ్లి బోరు, పంటను పరిశీలించారు. మండలంలోని దర్శినమల గ్రామంలో కొడిగ జయమ్మ పొలంలోని బోరుబావిలో నీరు అడుగంటిపోవడంతో సాగుచేసిన కర్బూజా, వరి పంటలు ఎండిపోయి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది.

ధర్మవరంరూరల్, మార్చి19(ఆంధ్రజ్యోతి): మహిళా రైతు జయమ్మ సమస్యపై అధికారులు స్పందించారు. పొలానికి వెళ్లి బోరు, పంటను పరిశీలించారు. మండలంలోని దర్శినమల గ్రామంలో కొడిగ జయమ్మ పొలంలోని బోరుబావిలో నీరు అడుగంటిపోవడంతో సాగుచేసిన కర్బూజా, వరి పంటలు ఎండిపోయి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ఆ మహిళారైతు పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం జయమ్మను వీడిన ‘గంగ’మ్మ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ అధికారులు జయమ్మ పంటపొలాలను బుధవారం పరిశీలించారు. పంటకు పెట్టిన పెట్టుబడి వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. మహిళరైతుకు జరిగిన నష్టం, పంటపొలాల పరిస్థితిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామని అధికారులు తెలిపారు. పొలాన్ని పరిశీలించిన వారిలో మండల ఉద్యాన శాఖ అధికారిణి అమరేశ్వరి, ఏఓ ముస్తఫా, వీఆర్‌ఓ చంద్రశేఖర్, ఎంపీఈఓ రాజేశ్వరి తదితరులు ఉన్నారు.