Share News

Collector బాధ్యతగా పనిచేయండి

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:10 AM

జిల్లాలోని తహసీల్దార్లు, సర్వేయర్లు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ భవనంలో ఆంధ్రప్రదేశ భూ రీసర్వే గురించి జిల్లాలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, డీప్యూటీ తహసీల్దార్‌కు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

Collector బాధ్యతగా పనిచేయండి
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ అభిషేక్‌కుమార్‌, కలెక్టర్‌ టీఎస్‌ చేతన

తహసీల్దార్లు, సర్వేయర్లకు కలెక్టర్‌ ఆదేశం

పుట్టపర్తి టౌన, మార్చి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తహసీల్దార్లు, సర్వేయర్లు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ భవనంలో ఆంధ్రప్రదేశ భూ రీసర్వే గురించి జిల్లాలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, డీప్యూటీ తహసీల్దార్‌కు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కలెక్టర్‌ మాట్లాడుతూ మండల తహసీల్దార్లు ఇంటి నివేశన, స్థల ధ్రువీకరణ పత్రాలను మ్యానువల్‌గా ఇవ్వకూడదన్నారు. ప్రతి తహసీల్దార్‌ డిజిటల్‌ కీని తనవద్దే ఉంచుకోవాలని, కిందిస్థాయి సిబ్బందికి డిజిటల్‌ కీ ఇచ్చి అనవసర సమస్యలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో తహసీల్దార్‌కు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆర్డీవోలకు తెలపాలని, ఆర్డీవోలకు సందేహం వస్తే జేసీ, డీఆర్వోలను సంప్రదించాలని సూచించారు. తహసీల్దార్లందరూ స్థానికం మండల కేంద్రంలోనే నివాసం ఉండాలని ఆదేశించారు. రీసర్వే సక్రమంగా జరిగితేనే భూ సమస్యలు తగ్గుతాయన్నారు. మండల సర్వేయర్లు గ్రామాల హద్దులు, భూ సరిహద్దుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో జిల్లాలోని అమరాపురం, అగళి, చిలమత్తూరు, రొద్దం, రొళ్ల, సోమందేపల్లి సర్వేయర్లపై వచ్చిన ఆరోపణలపై ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలందించాలన్నారు. జేసీ అభిషేక్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో 25మండలాల్లో 25 గ్రామాలను భూ రీసర్వేకోసం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తామన్నారు. ఆర్డీవోలు రీసర్వేపై ప్రతి గ్రామంలో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఆర్డీవోలు సువర్ణ, మహేష్‌, వీవీఎస్‌ శర్మ, ఆనంద్‌, ల్యాడ్‌ సర్వే అధికారి విజయశాంతి, 32మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 12:10 AM