Share News

DRDA: శిథిలావస్థకు చేరిన డీఆర్‌డీఏ గెస్ట్‌హౌస్‌

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:56 PM

డీఆర్‌డీఏ గెస్ట్‌హౌస్‌ శిథి లావస్థకు చేరింది. 1986 జనవరి 20వ తేదీన అప్పటి ఉమ్మడి రాష్ట్ర పరిశ్రమ ల శాఖ మంత్రి రామచంద్రారెడ్డి, అప్ప టి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ తిగిడి చేతుల మీదుగా డీఆర్‌డీఏ అతిథి గృహాన్ని ప్రారంభించారు.

DRDA: శిథిలావస్థకు చేరిన డీఆర్‌డీఏ గెస్ట్‌హౌస్‌
The dilapidated DRDA guesthouse

- పట్టించుకోని అధికారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): డీఆర్‌డీఏ గెస్ట్‌హౌస్‌ శిథి లావస్థకు చేరింది. 1986 జనవరి 20వ తేదీన అప్పటి ఉమ్మడి రాష్ట్ర పరిశ్రమ ల శాఖ మంత్రి రామచంద్రారెడ్డి, అప్ప టి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ తిగిడి చేతుల మీదుగా డీఆర్‌డీఏ అతిథి గృహాన్ని ప్రారంభించారు. అప్పటి నుం చి జిల్లాకు వచ్చిన ఎంతోమంది మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ప్రముఖు లు ఇందులో విడిది చేసేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహణ లోపంతో గెస్ట్‌హౌస్‌ పూర్తిగా శిథిలా వస్థకు చేరింది. కొన్ని గోడలు కూలాయి. లోపల ఉన్న ఫర్నిచర్‌ అంతా దెబ్బతింది. చాలా మంది బసచేసిన గెస్ట్‌హౌస్‌ ఇలా శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో ఏమి ఉపయోగమనుకుంటే పొరపాటే. బయట ప్రైవేటు హోటళ్లకు బదులు గా నగర నడిబొడ్డున అన్ని వసతులతో ప్రభు త్వ కార్యాలయాలు తదితర వాటికి అందుబాటు లో ఉండే డీఆర్‌డీఏ గెస్ట్‌హౌస్‌ను ఉపయోగిం చుకునే ప్రముఖులు ప్రభుత్వానికి అద్దె చెల్లించే వారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. పైగా ఇ క్కడ పూర్తిగా పచ్చని చెట్లతో మంచి వాతావర ణం ఉండేది. ఇప్పుడు లేదు. డీఆర్‌డీఏ గెస్ట్‌ హౌస్‌తో పాటు పక్కనే వాచమెన క్వార్టర్‌ ఉంది. అది కూడా పూర్తిగా ధ్వంసమైంది. వీటిని ఇలాగే వదిలేస్తే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే ప్రమాదం పొంచి ఉం ది. దీనిపై డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్యను వివరణ కోరగా.... కలెక్టర్‌ డీఆర్‌ డీఏ గెస్ట్‌హౌస్‌ను సందర్శించి పరిశీలించినట్లు తెలిపారు. ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించినట్లు పీడీ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 07 , 2025 | 11:56 PM