MPP election ఎంపీపీ ఎన్నికకు భారీ భద్రత
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:41 AM
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను గురువారం నిర్వహిస్తుండటంతో గాండ్లపెంటలో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు.

గాండ్లపెంట, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను గురువారం నిర్వహిస్తుండటంతో గాండ్లపెంటలో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం గురువారం సాయంత్రం వరకు గాండ్లపెంటలో 30ఏ యాక్టు, 144 సెక్షన అమల్లో ఉంటాయన్నారు. ప్రజలు గుంపులుగా ఉండకూడదన్నారు. అలాగే ఎన్నిక రోజున పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ వలీబాషా ఉన్నారు.