Share News

charges విద్యుత చార్జీల భారాన్ని తగ్గించాలి

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:29 AM

విద్యుత ట్రూఅప్‌, సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని సీపీఎం నాయకులు తహసీల్దార్‌ మురళీక్రిష్ణకు శుక్రవారం వినతిపత్రం అందచేశారు.

charges విద్యుత చార్జీల భారాన్ని తగ్గించాలి
కదిరి : తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న సీపీఎం నాయకులు

కదిరిఅర్బన, మార్చి28(ఆంధ్రజ్యోతి): విద్యుత ట్రూఅప్‌, సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని సీపీఎం నాయకులు తహసీల్దార్‌ మురళీక్రిష్ణకు శుక్రవారం వినతిపత్రం అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దినెలలోనే రెండుమార్లు సర్దుబాటు చార్జీల పేరుతో రూ.15 వేల కోట్లు పైచిలుకు ప్రజలపై భారం మోపిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు సర్దుబాటు చార్జీలను తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం ఆ భారాలు మరింత పెంచడం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయానికి స్మార్టు మీటర్లు బిగించడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాబ్‌జాన, రామమోహన, ముస్తాక్‌, సుధాకర్‌రెడ్డి, నారాయణ, గంగప్ప, ఆంజనేయులు, ఉదయ్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:29 AM