Share News

water problem తాగునీటి సమస్య పరిష్కరించండి

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:28 AM

తమ కాలనీకి పది రోజులుగా తాగు నీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని స్థానిక వైఎ్‌సఆర్‌ కాలనీకి చెందిన మహిళలు డిమాండ్‌ చేశారు.

water problem తాగునీటి సమస్య పరిష్కరించండి
ధర్నా చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాలనీ వాసులు

ధర్మవరం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): తమ కాలనీకి పది రోజులుగా తాగు నీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని స్థానిక వైఎ్‌సఆర్‌ కాలనీకి చెందిన మహిళలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ధర్మవరం-ఎనఎ్‌స గేట్‌ రహదారిపై ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ.. తాము కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాళ్లమని, తాగునీటి కోసం పనులు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఈ సమస్యను మున్సిపల్‌ అధికారులకు పలుమార్లు తెలియజేసినా వారు పట్టించుకోలేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ డీఈ వీరేశకుమార్‌ వారి వద్దకు వెళ్లి మహిళలతో మాట్లాడారు. తంబాపురం, ఆత్మకూరు దగ్గర కరెంటు లైనలు ఏర్పాటు చేస్తుండటంతో ఈ సమస్య వచ్చిందని, రాత్రి 12గంటలైన తాగునీరు వదులుతామని హామీ ఇవ్వడంతో ఆ మహిళలు ధర్నా విరమించారు.

Updated Date - Mar 29 , 2025 | 12:28 AM